యాచారం మండల కేంద్రంలో CITU ప్రచార జీప్ జాత ప్రారంభం

Published: Friday March 25, 2022
ఇబ్రహీంపట్నం మార్చి 24 ప్రజాపాలన ప్రతినిధి : ఈరోజు మండలపరిధిలో జీపు జాత కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈనెల 28 29 తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు డి జగదీష్. ఉపాధ్యక్షుడు పెండ్యాల బ్రహ్మయ్య, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు పి.అంజయ్య, జిల్లా కార్యదర్శి కే.జగన్ లు మాట్లాడుతూ. గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని కోరారు. వెట్టి చాకిరీ చేస్తున్నరని వారి శ్రమను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోచుకుంటూ న్నాయి. పీఎఫ్ ఈఎస్ఐ. ఆమలు లేదు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు... అరుహులకు ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. అట్లాగే. భవన నిర్మాణ కార్మికులు కనీస వేతనం అమలు చేయాలని  కార్మికులకు ప్రమాదవశాత్తు జరుగుతే ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఇవ్వాలని మరియు రోడ్డు ప్రమాదంలో  అంగవైకల్యం కోల్పోయినట్టు అయితే ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని కార్మికులు సొంత ఇల్లు నిర్మాణానికి ఇసుక రాయితీ ప్రి ఇవ్వాలని హెల్పర్ బోర్డు ఉన్నటువంటి డబ్బులు వేరే సంస్థలకు  మళ్ళించ వద్దని కోరారు యాచారం ప్రాంతంలో  అనేక పరిశ్రమలలో కనీస వేతనాలు అమలు చేయకుండా కార్మికులకు గుర్తింపు కార్డులు పి ఎఫ్  ఈ ఎస్ ఐ ఇవ్వకుండా 12గంటలు పని చేయించుకుంటూ శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ నాలుగు లెబరు కోడ్ చేయడం మానుకోవాలి అదేవిధంగా  ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ కరణ చేస్తూ మరియు  పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెంచింది కేంద్ర ప్రభుత్వం తక్షణమే లేబర్ కోడ్ లను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అధీక ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు. వ్యవసాయ కార్మిక సంఘంమండల అధ్యక్షుడు సత్యం. మహిళ సంఘం కార్యదర్శి అరుణ. కార్మికులు జంగయ్య య యాదయ్య కృష్ణ మైసమ్మ శాంతమ్మ ఇందిరా లలిత జంగయ్య య రాములు తదితరులు పాల్గొన్నారు.