శిధిలావస్థకు చేరిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పరిశీలించిన డిఎంహెచ్ఓ మారుతి

Published: Wednesday October 19, 2022

మధిర రూరల్ అక్టోబర్ 18 (ప్రజా పాలన ప్రతినిధి) శిథిలావస్థకు చేరిన మడుపల్లి ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని త్వరలోనే వినియోగంలోకి తీసుకొస్తామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాలతి పేర్కొన్నారు. మంగళవారం ఆంధ్రప్రభలో రాజుల సొమ్ము రాళ్ళ పాలు ప్రారంభం కాకుండానే శిధిలావస్థకు చేరిన భవనాలు అనే కథనాన్ని ప్రచురించింది. దీనికి స్పందించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాలతి నేషనల్ హెల్త్ మిషన్ జిల్లా అధికారి నీలోహన సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాలతి మాట్లాడుతూ మడుపల్లి గ్రామంలో బస్తీ దావాఖానా మంజూరు అయిందన్నారు. త్వరలోనే వాటిని ప్రారంభించడం జరుగుతుందని ఆమె తెలిపారు లక్షల రూపాయలతో నిర్మించి నిరుపయోగంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను  వినియోగంలోకి తేవడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. అనంతరం మధిర పట్టణంలోని  లడక బజారు ఎస్సీ కాలనీలో కూడా బస్తీ దవాఖానాలు మంజూరైనట్లు ఆమె తెలిపారు శిథిలావస్థకు చేరిన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలకు మరమ్మత్తులు చేపడుతామని ఆమె తెలిపారు ఆమె వెంట కమిషనర్ అంబటి రమాదేవి మాటూరు పేట వైద్యాధికారి  వెంకటేష్ పాల్గొన్నారు