మహిళలకు రక్షణ ఇవ్వలేని ప్రభుత్వాలు దిగిపోవాలి.తెలంగాణ మహిళా సమైక్య జిల్లా సహాయ కార్యదర్శి

Published: Friday July 22, 2022

మధిర,జులై21 ప్రజా పాలన ప్రతినిధి:రాష్ట్రంలో,దేశంలో రోజురోజుకు మహిళపై అత్యాచారాలు, ఎక్కువ జరుగుతున్నాయని, మహిళలకు రక్షణ ఇవ్వలేని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు దిగిపోవాలని తెలంగాణ మహిళా సమైక్య (ఎన్ఎస్ఐ డబ్ల్యూ)ఖమ్మం జిల్లా సహాయ కార్యదర్శి మందడపు రాణి అన్నారు.ఖమ్మం జిల్లా కేంద్రంలోని రోటరీ నగర్ సిటీ సెంటర్ హాల్ నందు తెలంగాణ మహిళా సమైక్య 21వ జిల్లా మహాసభ నిర్వహించారు. మహాసభ అనంతరం కార్యదర్శి నివేదిక ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్ర మహిళా సమైక్య (ఎన్ఎస్ఐడబ్ల్యు)ఖమ్మం జిల్లా సహాయ కార్యదర్శిగా మధిర మండలం మల్లవరం గ్రామానికి చెందిన అమరజీవి కామ్రేడ్ మందడపు నాగేశ్వరరావు సతీమణి మందడపు రాణిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ సందర్భంగా రాణి మాట్లాడుతూ.దేశంలో రాష్ట్రంలో రోజురోజుకు మహిళలపై దాడులు తీవ్రతరం అయ్యాయని వాటిని అరికట్టడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు.మహిళలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ప్రభుత్వాలకి ఎంతైనా ఉందని ఆమె తెలిపారు.దేశంలోని మహిళలను ప్రభుత్వ సంక్షేమ పథకాల ధ్వారా లక్షాధికారులుగా చేసి దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తామని ఊక దంపుడు ప్రసంగాలు చేయడం తప్ప, ఆచరణ లేదు అని రాణి విమర్శించారు.మహిళలకు,బాలికలకు రక్షణ కల్పించి న్యాయంచేయడంలో వివక్ష చూపించడం సరైందికాదని ఆమె అన్నారు.ఈ పాలక ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే ప్రతి నియోజకవర్గంలో ఒక మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి జిల్లాలో ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ను ఏర్పాటు చేసి మహిళా జడ్జిలను నియమించాలని రాణి డిమాండ్ చేశారు.భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ మహిళలకు ఇచ్చిన రాజ్యాంగ హక్కులను కాలరాసి, మహిళలను వంటింటికే పరిమితం చేసే కుటిల రాజకీయాలకు స్వస్తి పాలకాలన్నారు.మందడపు రాణి ఎన్నిక పట్ల పలువురు రాజకీయ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.