5వ వార్డులో తడి పొడి చెత్త అవగాహన

Published: Wednesday January 12, 2022
కౌన్సిలర్ పలుగుట్ట ప్రవళిక కృష్ణ
వికారాబాద్ బ్యూరో 11 జనవరి ప్రజాపాలన : తడి పొడి చెత్తను వేరువేరుగా వేయాలని 5వ వార్డు కౌన్సిలర్ పలుగుట్ట ప్రవళిక కృష్ణ అన్నారు. మంగళవారం మున్సిపల్ పరిధిలోని ఐదవ వార్డుకు సంబంధించిన కొత్రేపల్లి గ్రామంలో స్వచ్ఛ సర్వేక్షన్ 2022 లో భాగంగా మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ల పల్లి మండల రమేష్ సూచన మేరకు తడి పొడి చెత్త గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ప్రవళిక కృష్ణ మాట్లాడుతూ తడి చెత్తను పొడి చెత్తను వేరువేరు డబ్బాలలో వేయాలని సూచించారు. తడి పొడి చెత్తను ఒకే డబ్బాలో వేసి మున్సిపల్ సిబ్బందికి ఇవ్వడం వలన డంపింగ్ యార్డ్ లో వేరు చేయడం ఇబ్బందిగా ఉందని స్పష్టం చేశారు. మోరీ లలో చెత్తాచెదారాన్ని వేయరాదని సూచించారు. చెత్త చెదారం అంతా మోరీలలో వేయడం వలన మురికి నీరు జామై ఈగలకు దోమలకు ఆవాసాలుగా మారి ప్రజలు తీవ్ర అనారోగ్యాల పాలవుతారని హెచ్చరించారు. మలేరియా డెంగ్యూ వంటి విష జ్వరాలు వ్యాప్తి చెందే అవకాశాలు మెండుగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లో లో మహమ్మద్ ఇస్మాయిల్ వీరారెడ్డి మాణిక్యం నిర్మల కవిత తదితరులు పాల్గొన్నారు.