బుద్ధ పౌర్ణమి తో సత్య ధమ్మ సందేశ్ యాత్ర ముగింపు* -గురు తోటపల్లి భుమన్న మహారాజ్

Published: Tuesday May 17, 2022
మంచిర్యాల టౌన్, మే 16, ప్రజాపాలన : సత్య ధమ్మ సందేశ్ యాత్ర ముగింపు సంబరాలు, సత్య ధమ్మ సందేశ్ యాత్ర  బహుజన తాత్విక భావనలను సబ్బండ వర్ణాల ప్రజలకు ప్రవచన రూపంలో అవగాహన కల్పించడం కొరకు సత్య ధర్మ సంస్థాపకులు బహుజన  తాత్విక భక్తి  ఉద్యమకారులు గురు తోటపల్లి భూమన్న  సత్య ధమ్మ సందేశ్ యాత్రను బుద్ధ పౌర్ణమి  సోమవారం తో పది రోజుల యాత్ర పూర్తిచేసుకొని జిల్లాకు వచ్చిన సంద్భంగా  పాత మంచిర్యాల నుండి స్థానిక ఐ బి చౌరస్తా వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి   పూలమాలలు వేసి యాత్ర ముగించారు .ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ బహుజన సిద్దాంతాన్ని, బహుజన తత్వాన్ని  ప్రజలకు ప్రవచన రూపంలో అవగాహన కల్పిస్తూ యాత్ర చేపట్టిన ట్లు తెలిపారు. ఈ యాత్ర  ను ఆదరించిన    మంచిర్యాల, కొమురం భీమ్ ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలలో ఈ కార్యక్రమాన్ని  బహుజన ప్రజలు ఆహ్వానించి ఆదరించి విజయవంతం చేశారు. సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక  కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో యశ్వంత్ మహారాజ్, జిల్లపెల్లి వెంకటేష్ ఎస్. సి.,ఎస్.టి మానిటరింగ్ కమిటీ సభ్యులు, గోడిసెల దశరథం, కాదశి రవీందర్, రామగిరి శ్రీపతి, అట్కపురం రాజలింగు, ప్రేమ్ రావు, బి యస్ ఎన్ ఎల్ లింగన్న, జి.నారాయణ, ఉపరపు బుచ్చన్న, కొసిని శంకర్, వంగూరి కేనాడి, ఆరుముల్ల రాజు, మద్దిల భవానీ, పార్వతి సత్యనారాయణ, ఎం.ఎ  సలీం, వెంకట్ రెడ్డి , మెరుగు నరేందర్, చాపిడి సందీప్, గొట్టే సురేందర్, కామేర గణేష్, దేవరపల్లి మధుబాబు, దుర్గం పోషం, పత్తిరామస్వామి, తదితరులు పాల్గొన్నారు.