బతుకమ్మను ఎత్తిన ఎంపీపీ చంద్రకళ

Published: Saturday October 01, 2022

వికారాబాద్ బ్యూరో 30 సెప్టెంబర్ ప్రజా పాలన : బతుకమ్మ సంబరాలను వికారాబాద్ మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు భాగంలో శుక్రవారం సిబ్బంది ఆడి పాడారు. తీరొక్క పూలను సేకరించి బతుకమ్మను అందంగా పేర్చి మహిళా సిబ్బంది పాటలకు అనుకూలంగా అడుగులు వేస్తూ చప్పట్లు కొడుతూ ఆడారు. బతుకమ్మ ఆడిన అనంతరం వికారాబాద్ ఎంపీపీ కామిడీ చంద్రకళ బతుకమ్మను నెత్తిన ఎత్తుకున్నారు. తదనంతరం బతుకమ్మను చెరువులో వదిలేశారు. ఈ కార్యక్రమంలో సీఈఓ జానకి రెడ్డి డిప్యూటీ సీఈవో సుభాషిణి పిడిఓ సత్తయ్య వికారాబాద్ మండల ప్రజా పరిషత్ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.