మండలంలో నేటి నుండి స్వచ్చంద లాక్ డౌన్

Published: Saturday May 08, 2021

వలిగొండ, మే 7, ప్రజాపాలన ప్రతినిధి మండల కేంద్రంలో నేటి నుండి ఈ నెల 31 వరకు స్వచ్చంద లాక్డౌన్ విదిస్తున్నట్లు స్థానిక సర్పంచ్ బొల్ల లలిత శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో వారు అఖిపక్షం నాయకులు, వ్యాపారస్తులతో అత్యవసర సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ప్రజలు, వ్యాపారస్తుల సూచన మేరకు రోజు రోజుకు పెరుగుతున్న కరోనా నివారణకు నేటి నుండి ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం2 గంటలవరకు తెలిచి తర్వాత వ్యాపార సంస్థలు, దుకాణాలు మూసివేసి స్వచ్చంద లాక్డౌన్ అమలు పర్చుకోవాలని గ్రామ ప్రజలకు, వ్యాపారస్థులకు సూచించారు. ఈ తీర్మానాన్ని ఎవరైనా ఉల్లంఘించినట్లైతే వెయ్యి రూపాయల జరిమాన విదించి చర్యలు తీసుకుంటామని, తీర్మానం మేరకు గ్రామ ప్రజలు, వ్యాపారస్తులు సహరించి కరోనాను తరిమికొట్టాలని అన్నారు. స్థానిక పోలీసులు ప్రతి రోజు ఒక గంట ముందు పెట్రోలింగ్ నిర్వహించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి కుందారపు యశోదా కొమురయ్య, స్థానిక ఏఎస్సై శ్యామ్ సుందర్ రెడ్డి, కార్యదర్శి ఆనంద్ కుమార్, మైసోళ్ల మత్స్యగిరి, కూర శ్రీనివాస్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.