సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ కూనంనేని సాంబశివరావు

Published: Wednesday July 28, 2021
మధిర, జులై 27, ప్రజాపాలన ప్రతినిధి : సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా గార్ల అక్రమ అరెస్టులకు నిరసనగా సిపిఐ మధిర పట్టణ సమితి, ఏఐటీయూసీ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా సిపిఐ మధిర పట్టణ కార్యదర్శి బెజవాడ రవి మాట్లాడుతూ పెదప్రజల నివాసాలను దుర్మార్గంగా అధికారులు కూల్చివేస్తుంటే వాటిని అడ్డుకుని పేద వారికి రక్షణగా వున్నందుకు అరెస్టులు చేస్తారా అని అధికారులను ప్రశ్నించారు. తక్షణమే అక్రమంగా అరెస్ట్ చేసిన నాయకులను బే షరతుగా విడుదలచేయాలని కొత్తగూడెం పోలీసులను డిమాండ్ చేశారు.ఈ ధర్నా కార్యక్రమంలో పట్టణ నాయకులు మంగళగిరి రామానుజం, అన్నవరపు సత్యనారాయణ, కొండా సాహెబ్, కోటమ్మ, నాగేశ్వరావు, ఆటో యూనియన్ నాయకులు భద్రం, శ్రీను, రమేష్, పరిశుద్ధం, అంజి, మొదలగు వారు పాల్గొన్నారు.