కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న యువతులకు సర్టిఫికెట్లను ప్రధానం చేసిన అడిషనల్ కలెక్టర్ మధు

Published: Tuesday July 05, 2022
బెల్లంపల్లి జూలై 4 ప్రజా పాలన ప్రతినిధి: బెల్లంపల్లి నియోజకవర్గంలోని వేమనపల్లి మండలం నీల్వాయి  రైతు వేదికలో గత మూడు నెలలుగా వయోజన విద్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కుట్టు శిక్షణా కార్యక్రమం పూర్తయిన సందర్భంగా శిక్షణ పొందిన యువతులకు 60 మందికి మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ సోమవారం సర్టిఫికెట్లను ప్రధానం చేశారు.
ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ మాట్లాడుతూ
గత 90 రోజుల నుండి కుట్టు శిక్షణ కు ఆర్థికంగా సహకరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సయ్యద్ సాబీర్ అలీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో  ఆడిషల్ కలెక్టర్ డి, మధుసూదన్ నాయక్, వయోజన విద్య శాఖ జిల్లా ఇంచార్జి పురుషోత్తం , నీల్వాయి ఎంపీటీసీ ఆర్, సంతోష్ కుమార్ , సర్పంచ్ గాలి మధు, డి,అర్,పి లు సుందిళ్ళ రమేష్ , అశోక్ , మండల కోఆర్డినేటర్ లక్ష్మి, శిక్షకురాలు శైలజ, నిర్వాహకులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ సాబీర్ అలీ, శిక్షణ పొందిన  యువతులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area