రైతులకు విత్తన శుద్ధి గురించి అవగాహన కార్యక్రమం

Published: Thursday June 17, 2021
పరిగి, జూన్ 16, ప్రజాపాలన ప్రతినిధి : వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని కేశిలమ్మ తండా మూడవ రెడ్యా నాయక్ పొలాన్ని వ్యవసాయ శాఖ- ఆత్మ అధికారులు ప్రదర్శన క్షేత్రంగా ఎన్నుకోవడం జరిగింది ఈ ప్రధాన క్షేత్రం లో భాగంగా పరిగి- 176 రకం కంది విత్తనాన్ని రెడ్యా నాయక్ కి ఇచ్చి విత్తన శుద్ధి యొక్క ప్రాముఖ్యత గురించి రెడ్డి నాయక్ మరియు కేశిలమ్మ తండాకు చెందిన రైతులకు వివరించడం జరిగింది. ట్రై గో డెర్మా వేరిడితో ఒక కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడెర్మా విరిడిగా చిత్తశుద్ధి చేయించడం జరిగింది. ట్రైకోడెర్మా వీరిడితో విత్తన శుద్ధిి చేస్తే కంది మొలకలు చనిపోకుండా ఉంటాయని రైతులకు వివరించారు విత్తన శుద్ధి చేయడం వలన కంది మొలకలు ఒక నెల రోజుల పాటు చీడపీడలు రావని వ్యవసాయ అధికారులు వివరించారు విత్తన శుద్ధి చేసుకునే రైతులు ముందుగా శిలీంధ్ర నాశిని తో చేసుకొని తర్వాత కీటకనాశిని తో(ఇన్ఫెక్షన్ సైడ్స్) దాని తర్వాత రైoడో బియoతో చేసుకోవాలి ఈ ప్రధాన క్షేత్రం లో ఆత్మ అధికారులు గణేష్ డి టి ఎం మణికొండ కేస్ ఎల్లమ్మ తండా కు చెందిన రైతులు పాల్గొన్నారు.