సామాన్యుల నడ్డి విరిసేలా గ్యాస్ ధరలు పెంచిన కేంద్రం.టిఆర్ఎస్ మధిర జూలై 7 ప్రజాపాలన ప్రతినిధి

Published: Friday July 08, 2022

దేశాన్ని ఆదాని, అంబానీలకు తాకట్టు పెడుతున్న మోడీ అమిత్ షా .హైదరాబాదులో బోగస్ మాటలు చెప్పిన మోడీ ఢిల్లీ వెళ్లి గ్యాస్ ధరలు పెంచారు.మోడీ పాలనలో దేశం అధోగతి పాలవుతుంది.కెసిఆర్ తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది.జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు.అంబేద్కర్ సెంటర్లో పెంచిన గ్యాస్ ధరలకు నిరసనగా కట్టెల పొయ్యి తో టిఆర్ఎస్ నిరసన.మధిర: కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరల వలన సామాన్యుల నడ్డి విరిచి వారిపై పెనుబారం పడిందని వెంటనే పెంచిన గ్యాస్ ధరలను కేంద్రం తగ్గించాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గురువారం స్థానిక టిఆర్ఎస్ కార్యాలయం నుండి టిఆర్ఎస్ నాయకులతో కలిసి జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు మోటార్స్ సైకిల్ ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ సెంటర్లో కట్టెల పొయ్యి తో గ్యాస్ బండకు పసుపు కుంకుమతో పూజలు చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ హైదరాబాదులో బోగస్ మాటలు మాట్లాడి ఢిల్లీ వెళ్లి గ్యాస్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరిచారని ఆయన ఆరోపించారు. పెంచిన గ్యాస్ ధరలతో 1105  రూపాయలు సామాన్యులకు భారంగా మారిందని వారన్నారు.భారతదేశాన్ని ఆదాని అంబానీ లకు మోడీ అమిత్ షా లు తాకట్టు పెడుతున్నారని ఆయన విమర్శించారు.దేశంలో ఉన్న ఎల్ఐసి విమానయానం రైల్వే వ్యవస్థలను ప్రైవేటీకరణ చేసే ఆలోచనలు కేంద్ర ప్రభుత్వం ఉందని వారు తెలిపారు భారతదేశం అభివృద్ధిలో వెనకబడి దరిద్రంలో ప్రథమ స్థానంలో ఉందని జెడ్పీ చైర్మన్ తెలిపారుబిజెపి నాయకులు పదేపదే డబల్ ఇంజన్ ప్రభుత్వం కావాలని చెబుతున్నారని బిజెపి డబల్ ఇంజన్ కాదు  బొగ్గు ఇంజన్ అని అదే మా టిఆర్ఎస్ ఇంజన్ మెట్రో ఎలక్ట్రికల్ హై స్పీడ్ ఇంజన్ అని తెలిపారు. దేశంలో కెసిఆర్ ప్రభుత్వం అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. బిజెపి నాయకులు మతాన్ని భావోద్వేగాలను రెచ్చగొట్టి అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.మోడీ హైదరాబాదులో బోగస్ మాటలు మాట్లాడి ఢిల్లీ వెళ్లి గ్యాస్ ధరలు పెంచాలని ఇప్పటికే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగి ప్రజలకు భారంగా మారితే గ్యాస్ ధరలతో సామాన్యులకు మరింత భారంగా మారిందని వారు తెలిపారు. ఎన్నికల్లో నిరుద్యోగులకు కోటి ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన బిజెపి హామీ  నేటికీ నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు.వెంటనే కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ కరులను తగ్గించుకుంటే కేంద్రంలో బిజెపి పతనం తప్పదని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత, ఎంపీపీ మొండెం లలిత వెంకయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తా రు నాగేశ్వరరావు ఆత్మ కమిటీ చైర్మన్ రంగి శెట్టి కోటేశ్వరరావు, రైతుబంధు కన్వీనర్ చావా వేణుబాబు, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కనుమూరు వెంకటేశ్వరరావు మండల కార్యదర్శి బొగ్గుల భాస్కర్ రెడ్డి, శివాలయం చైర్మన్ వంకాయలపాటి నాగేశ్వరరావు, వార్డ్ కౌన్సిలర్లు వైవి అప్పారావు మాధవి ఎర్రగుంట లక్ష్మీ రమేష్, టిఆర్ఎస్ నాయకులు వాసిరెడ్డి నాగేశ్వరరావు కర్నాటి శ్రీను, కొఠారి రాఘవరావు, టిఆర్ఎస్ నియోజకవర్గ యూత్ కన్వీనర్ కోన నరేందర్ రెడ్డి, నల్లమల్ల శ్రీనివాసరావు నంబూరి శ్రీను అబ్బూరి రామన్ గుగులోత్ కృష్ణ, చారి గద్దల నాని గద్దల రాజా తదితరులు పాల్గొన్నారు.