రెండో రోజుకి చేరిన మిషన్ భగీరథ కార్మికుల సమ్మె

Published: Friday July 22, 2022

మధిర జులై 21 ప్రజాపాలన ప్రతినిధి మిషన్ భగీరథ కార్మికులకు వెంటనే వేతనాలు చెల్లించాలని కోరుతూ మిషన్ భగీరథ కార్మికులు చేపట్టిన సమ్మె గురువారం నాటికి రెండో రోజుకు చేరుకుంది. మిషన్ భగీరథ టిఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు జిల్లేపల్లి బాబురావు అధ్యక్షతన మధిర మండలం మాటూరు క్రాస్ రోడ్ వద్దగల మిషన్ భగీరథ ఓహెచ్ బిఆర్ ముందు ఎర్రుపాలెం మధిర బోనకల్ మండలాల్లో పనిచేస్తున్న సుమారు 80 మంది కార్మికులతో విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమం  చేపట్టారు. మిషన్ భగీరథ కార్మికుల సమ్మెకు సిపిఐ పట్టణ కార్యదర్శి బెజవాడ రవిబాబు సంఘీభావం తెలిపి తక్షణమే కార్మికుల న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమ్మెకు సిపిఐ పార్టీ పూర్తి మద్దతు తెలుపుతుందని ఆయన వెల్లడించారు. అనంతరం ఎల్ అండ్ టి కంపెనీ ప్రతినిధులు కార్మికులుతో జరిపిన చర్చలు విఫలం అయ్యాయి ఈ సందర్భంగా మిషన్ భగీరథ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జల్లేపల్లి బాబురావు మాట్లాడుతూ కార్మికులకు వేతనాలు ఇచ్చేవరకు సమ్మె విరమించేది లేదని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎర్రుపాలెం మండల బాధ్యుడు కొండూరు నాగేశ్వరావు మారాబత్తుల వెంకటేశ్వర్లు మధిర మండల బాధ్యులు రాయబారపు కుమార్, కొంగర రవి, ముల్లంగి మోషే బోనకల్ మండల బాధ్యులు పుట్టా వెంకటరత్నం, దారా ప్రకాష్ తో పాటు మూడు మండలాల కార్మికులు పాల్గొన్నారు.