ఘనంగా ఆర్.ఎస్.ప్రవీణ్ జన్మదిన వేడుకలు

Published: Wednesday November 24, 2021

జగిత్యాల, నవంబర్ 23 (ప్రజాపాలన ప్రతినిధి): బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటెర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు మంగళవారం జగిత్యాలలో ఘనంగా జరిగాయి. బిఎస్పీ జిల్లా అధ్యక్షులు చిర్ర శంకర్ సారథ్యంలో జరిగిన జన్మదిన వేడుకలలో పలువురు మాట్లాడుతూ బహుజనుల సమస్యల పరిష్కరించడానికి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఉన్నతమైన పదవిని వదిలి బిఎస్పీలో చేరాడని, ఇలాగే ఎన్నో జన్మదిన వేడుకలను జరుపుకోవాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిఎస్పీ జిల్లా నాయకులు మద్దెల నారాయన, జిల్లా ఉపాధ్యక్షులు నక్క విజయ్, జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లంపెళ్లి సంపత్ కుమార్, కల్లే పెళ్లి తిరుపతి, బివిఎఫ్ జిల్లా కార్యదర్శి న్యాయవాది భిరుదుల లక్ష్మణ్, నియోజకవర్గ ఇంచార్జ్ బొల్లారం సురేష్, గజ్జెల రమేష్, సంజీవుతో పాటు పలువురు ఉన్నారు.