జయసారధిరెడ్డి గెలుపును కోరుతూ సిపిఐ(ఎం) నాయకుల విస్తృత ప్రచారం

Published: Tuesday March 02, 2021
మధిర మార్చి 1 ప్రజాపాలన ప్రతినిధి: ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం లో వామాపక్షాలు బలపరిచిన అభ్యర్థి జయసారధిరెడ్డి గారి విజయాన్ని కాంక్షిస్తూ మధిర  పట్టణంలో ఈరోజు ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాల లలో ప్రైవేటు జూనియర్ కళాశాలలో సిపిఐ సీపీఎం పట్టణ కార్యదర్శులు రవి శీలం నర్సింహారావు ప్రచారం చేశారు ఈ సందర్బంగా మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులను నిరుద్యోగులను ఇంకా మోసం చేయడానికే చూస్తున్నారని గడచిన ఆరున్నర సంవత్సరాలు గా చెప్పిన అబద్దాలే మళ్ళీ మళ్ళీ చెబుతున్నారని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కెసిఆర్ ప్రభుత్వం లక్షా ముప్పై రెండు వేల ఉద్యోగాలు భర్తీ చేశామని కేటీర్ ప్రకటించిన విషయం తెలిసిందే వెంటనే జయసారధిరెడ్డి గారు బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేస్తే ఇంతవరకు ఒక్కరు కూడా స్పందించలేదు. 32 నెలలు దాటినా, పీ ఆర్ సీ కమిటీ రిపోర్ట్ ఇచ్చినా కెసిఆర్ కు ఉద్యోగ ఉపాధ్యాయులకు పీ ఆర్ సీ ఇచ్చే ఉద్యేశం లేదు. అలాగే ఉద్యోగం కొరకు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే విషయం లో రాష్ట్ర వ్యాప్తంగా షుమారు మూడు లక్షల ఖాళీగా వున్నా భర్తీ చేసేందుకు తీరికలేదని, కానీ తన కన్న కూతురు మాత్రం ఎంపీ పదవిని ప్రజలు ఊడకొడితే నాలుగునెలలు గా ఇంట్లో ఖాళీ గా ఉండటం చూసి తట్టుకోలేక వెంటనే MLC పదవి కట్టబెట్టినాడని,మరి ఎన్నో సంవత్సరాలుగా తెలంగాణా లోని నిరుద్యోగ బిడ్డలు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నా పట్టించుకోని ఈ టీఆర్ఎస్ ఏ మొఖం పెట్టుకొని ఓట్లకోసం వచ్చారాని ప్రతి నిరుద్యోగబిడ్డ నీలాదీయాలనీ పిలుపునిచ్చారు.రాబోయే రోజులలో ఇటువంటి నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా పోరాడే దమ్మున్న వ్యక్తి జయసారధిరెడ్డి అని అందుకే వామాపక్షాలు, మేధావులు, ప్రజాసంఘాలు, నిరుద్యోగులు, ఉద్యోగఉపాధ్యాయులు, బలపరచినా రని తప్పకుండా మొదటి ప్రాధాన్యత ఓటు జయసారధిగారికి వేసి గెలిపించాలని కోరినారు. ప్రచారంలో సిపిఐ మండల కార్యదర్శి ఊట్ల కొండ, రాధాకృష్ణ చెరుకూరి వెంకటేశ్వరరావు, SFI జిల్లా అధ్యక్షులు మధు AISF డివిజన్ కార్యదర్శి పవన్ మొదలగువారు పాల్గొన్నారు.