సాయిబాబా గుడి దగ్గర చెరువును తలపిస్తున్న ఖాళీ స్థలం

Published: Friday July 23, 2021
మధిర, జులై 22, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ మధిర మున్సిపాలిటీ పరిధిలో 17వ వార్డు నందు కాళీ ప్లాట్లు మరియు రోడ్డు పైన నీరు నిలిచి చుట్టుపక్కల ఉన్న ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉన్నది మొన్న పట్టణ ప్రగతి లో మున్సిపల్ కమిషనర్ గారికి కాళీ ప్లాట్లో నీళ్లు నిలవడం వలన మరియు పందులు తిరగటం వలన చుట్టుపక్కల ఉన్న ప్రజలకు వైరల్ ఫీవర్ జలుబు దగ్గు వస్తున్నాయి దీని వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారని మేము చెప్పినాము లెటర్ ఇచ్చిన గాని పట్టించుకోలేదు. లీడర్లు ఇంటి ముందు మట్టి రోడ్డుకి పోయించు కోవటం డ్రైనేజీ కట్టుకోవడం తప్ప సామాన్యులు ఇళ్ళముందు రోడ్లు ఎవరూ పట్టించుకోవట్లేదు తప్ప సామాన్యులు ఉండే ఏరియాను ఏ మాత్రం  పట్టించుకోవటం లేదు ఖాళీ ప్లాట్ లో వాటర్ నిల బడటం వలన పందులు తిరగటం వలన చుట్టుపక్కల ఉన్న ప్రజలకు దోమలు మలేరియా డెంగ్యూ వస్తున్నాయి దయచేసి దయచేసి ఇప్పటికైనా స్పందించి నీళ్లు పందులు లేకుండా చేయవలసిందిగా కోరుచున్నాము.