మన ఊరు మన బడి కార్యక్రమానికి హాజరై 25 వేల రూపాయలు అందజేసిన ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగ

Published: Monday December 05, 2022
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఏర్పాటుచేసిన తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ 4వ విద్య వైజ్ఞానిక మహాసభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్  పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు  హాజరయ్యారు, మహాసభలకు రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 25 వేల రూపాయల నగదును విరాళంగా అందజేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నో ప్రభుత్వాలు పనిచేసినప్పటికీ విద్య వ్యవస్థ పై దృష్టి పెట్టలేదని అన్నారు, కేంద్రాల్లోని బిజెపి ప్రభుత్వం సహకరించకపోయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ పై దృష్టి సారించి మన ఊరు మనబడి ద్వారా అనేక నిధులు మంజూరు చేసిందని గుర్తు చేశారు, ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివేనందుకు ముందు కావాలని కోరారు, సమాజాన్ని మార్చే సత్తా మేధావి పరమైన ఉపాధ్యాయులకు ఉన్నదన్నారు, త్వరలోనే రాష్ట్ర ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని అన్నారు, పేద విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తూ వారికి మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని అన్నారు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన విద్యను అందించడం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నది అన్నారు, మన ఊరు  మనబడి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, అన్నారు,