అంధత్వ రహిత సమాజమే తెలంగాణ ప్రభుత్వలక్ష్యం సర్పంచ్ బంగారమ్మ, ఎంపీపీ మొండెం లలిత, ఎంపీడీఓ వి

Published: Tuesday March 07, 2023

 మధిర ,మార్చి 6 ప్రజా పాలన ప్రతినిధి: సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ తరపున పిహెచ్సి దెందుకూరు వైద్యులు డా. పృథ్వి మరియు కంటి వెలుగు డా. సునీత పారా మెడికల్ సిబ్బంది ఆధ్వర్యంలో మండలం పరిధిలో మహాదేవపురం జిపి హెల్త్ సెంటర్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ కంటి వెలుగు ప్రోగ్రాం ను మొదటగా గ్రామ ప్రధమ పౌరురాలు నరకూటి బంగారమ్మ తులసీరామ్ ఎంపీపీ మొండెం లలిత వెంకయ్య, ఎంపీడీఓ విజయ భాస్కర్ రెడ్డి సమక్షంలో మరియమ్మ అనే మహిళకు వీరి చేతులు మీదుగా కంటి అద్దాలను అందజేసి క్యాంపు ప్రారంభించినారు.ఈసందర్బంగా వారు మాట్లాడుతూ అంధత్వ రహిత సమాజమే తెలంగాణ ప్రభుత్వం ప్రధానలక్ష్యం అని పెద్దలు అన్నారు. ఈ కార్యక్రమం పల్లె దవఖానా జిపి కార్యాలయం ప్రక్క ప్రక్కన వున్నవి కనుక కంటి వెలుగుకు 5 కౌంటర్ లు కావాలి కనుక ఈ రెండు కార్యలయాలు ఉపయోగిస్తున్నారు.ఈ క్యాంపు వారం రోజులు గ్రామములో కొనసాగుతున్నది అని ఉదయం 9 గంటలనుండి సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది అని 18 సంవత్సరాలు పై బడిన వారు తమ ఆధార్ కార్డు వెంట తెచ్చుకొని కంటి పరీక్షలు చేయించుకోవాలని వారు అన్నారు.