మున్సిపాలిటీ పరిధిలోలడక్ బజర్ లో

Published: Saturday July 23, 2022

హెల్త్ క్యాంపు మధిర జులై 22 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో లడక బజారులో సీజనల్ వ్యాదుల నివారణలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ

తరపున పిహెచ్సి దెందుకూరు వైద్యులు డా. శశిధర్ ఆధ్వర్యంలో పారామెడికల్ బృందం సoయుక్తంగా లడక్ బజార్ గడ్డ మీద స్థానిక ఎఎన్ఎమ్ గృహం నందు ఉచితం వైద్య శిభిరం ఏర్పాటు చేసి చిరువ్యాదులకు చికిత్స చేసి తగిన మందులు అందజేశారు.అదే విధంగా సీజనల్ వ్యాధులు ప్రభలకుండా ఎలాంటి జాగ్రతలు తీసికోవాలో సంపూర్ణముగా వివరించారు. ఈ కార్యక్రమంలో పిహెచ్ఎన్ గోళీ రమాదేవి హెచ్ఇఒ యస్ గోవింద్ హెచ్ఎస్ సుబ్బలక్ష్మి హెచ్వి కౌసెల్య ఎఎన్ఎమ్ వై లక్ష్మి హెచ్ఎ జి శ్రీనివాస్, ఆశ కార్యకర్తలు, ముంతాజ్, అంజూ, నాగమణి ,ఐసిడిఎస్,మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.