మేకవనంపల్లి అభివృద్ధే ప్రధాన లక్ష్యం : సర్పంచ్ పట్లోళ్ళ శశిధర్ రెడ్డి

Published: Wednesday July 07, 2021
వికారాబాద్, జూలై 06, ప్రజాపాలన బ్యూరో : గ్రామాన్ని పచ్చందాల హరివిల్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని మేకవనంపల్లి సర్పంచ్ పట్లోళ్ళ శశిధర్ రెడ్డి అన్నారు. మంగళవారం ప్రజాపాలన బ్యూరో తో మాట్లాడుతూ.. మంచి నీటి సమస్యను తీర్చడానికి ఇంటింటికి నళ్ళా కనెక్షన్ను మిషన్ భగీరథ నళ్ళా కనెక్షన్ ఇప్పించానని పేర్కొన్నారు. 10 లక్షల జడ్పి నిధులతో సిసి రోడ్లు, 5 లక్షల నిధులతో ఉన్నత పాఠశాల భవనం, 8 లక్షల నిధులతో ఫార్మేషన్ రోడ్లు, వేయించామని తెలిపారు. 16 లక్షల ఎన్ ఆర్ఈజిఎస్ నిధులతో జిపి భవనాన్ని నిర్మించామని వివరించారు. జిపి నిధులతో గ్రామంలో 36 సిసి కెమెరాలు, 80 వేలతో బస్ స్టాండ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను నిర్మించామని చెప్పారు.ఎన్ ఆర్ఈజిఎస్ 5 లక్షల నిధులతో పశువుల తొట్టిలు నిర్మించామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన పల్లె ప్రగతిలో భాగంగా రైతు వేదిక, డంపింగ్ యార్డు, కంపోస్ట్ షెడ్, పల్లె ప్రకృతి వనం, హరిత హారం, తడి పొడి చెత్త సేకరించి డంపింగ్ యార్డుకు తరలించుట వంటి పనులను పూర్తి చేశామని అన్నారు. వైకుంఠధామం నిర్మాణం పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో మోమిన్ పేట్ మండల పరిధిలో 2000 చొప్పున మాస్కులు, శానిటైజజర్ నా స్వంత డబ్బులతో పంపిణీ చేశామని చెప్పారు. మా నాన్నగారు మోమిన్ పేట్ పిఏసిఎస్ చైర్మన్ పట్లోళ్ళ అంజిరెడ్డి సౌజన్యంతో జిపికి 6 గుంటల భూమిని విరాళంగా అందజేశామని తెలిపారు. నాపదవీ కాలంలో మేకవనంపల్లి గ్రామం అంతా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని లక్ష్యం ఉందన్నారు. పంచాయతీ కార్యదర్శి శ్రావణి, నోడల్ ఆఫీసర్ శాంత, గ్రామ స్థాయి సిబ్బంది సహకారంతో పల్లె ప్రగతిని సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.