కార్మికుల సమస్యల పరిష్కారాని కై సిఐటియు ఆందోళన . . మిషన్ భగీరథ సూపర్డెంట్ ఆఫ్ ఇంజనీర్ కార్యా

Published: Wednesday February 01, 2023
 వేతనాలు చెల్లింపులో జీవో నెంబర్ 60 లేదా 11  అమలు చేయాలని వినతి.
 
మంచిర్యాల బ్యూరో, జనవరి 31, ప్రజాపాలన:
 
 
 మిషన్ భగీరథ కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికై సిఐటియు  ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన చెపట్టారు. జిల్లా కేంద్రంలోని తొళ్ల వాగు వద్ద ఉన్న సూపర్డెంట్ ఆఫ్ ఇంజనీర్ మిషన్ భగీరథ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు . ఈ సందర్భంగా 
 సీఐటీయు ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు అల్లూరి లోకేష్ మాట్లాడుతూ
 రాష్ట్రవ్యాప్తంగా మిషన్ భగీరథ స్కీమ్ లో పంపు ఆపరేటర్, లైన్మెన్,ఫిట్టర్ ఎలక్ట్రికల్ ఆపరేటర్స్, వాల్ ఆపరేటర్స్,ల్యాబ్ టెక్నీషియన్, వాచ్మెన్, సూపర్వైజర్ తదితర హోదాల్లో పని చేస్తున్నారని, మిషన్ భగీరథ కార్మికుల శ్రమ ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వానికి అనేక బహుమతులు వచ్చాయని పేర్కొన్నారు.ఐతే  ప్రస్తుతం కార్మికుల స్థితి ఏమాత్రం బాగోలేదని చాలీచాలని వేతనాలతో జీవనం గడుపుతున్నారని అన్నారు. మిషన్ భగీరథ స్కీం నిర్వహణకు తీసుకున్న కంపెనీలు కార్మికుల పొట్ట కొడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. కనీస వేతనాలు అమలు చేయాల్సిన ప్రభుత్వ , అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు.  సీఐటియు మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం కంపెనీలకు ఇచ్చే ఎస్ఎస్ఆర్ రేట్లు 18 వేలకు పైగా చూయిస్తున్నారని,  కార్మికులకు మాత్రం 8500  నుండి 12,000 రూపాయల లోపు మాత్రమే వేతనం చెల్లిస్తున్నారని తెలిపారు. గతంలో ఆర్డబ్ల్యూఎస్ స్కీంను ప్రస్తుత మిషన్ భగీరథగా మార్చారని, ఆర్డబ్ల్యూఎస్ స్కీముగా కొనసాగుతున్నప్పుడు కార్మికులకు జీవో నెంబర్ 11 అమలు అయ్యింది కాబట్టి ప్రస్తుతం జీవో ఎంఎస్ నెంబర్ 11 భగీరథ స్కీంలో పనిచేసే కార్మికులకు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా లైన్మెన్ లకు ట్రావెల్ అలవెన్సులు చెల్లించాలని, లేదా నిబంధన ప్రకారం 15 కిలోమీటర్ల ఒకరు చొప్పున లైన్మెన్ నియమించాలని సూచించారు. వేతనాలు సకాలంలో చెల్లించని కంపెనీలను బ్లాక్ లిస్ట్ లో ఉంచాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత, 20% బోనస్,రక్షణ పరికరాలు, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి.8 గంటల పని దినము అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గం లింగయ్య ఆసిఫాబాద్ సెగ్మెంట్ ప్రధాన కార్యదర్శి, చందు, వెంకటేష్, అంబుజిరావు, దుర్గజీ, మధుకర్.. ధర్నాకు మద్దతుగా సంకె రవి సిపిఎం జిల్లా కార్యదర్శి,రాజ్ కుమార్ డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు, ప్రేమ్ కుమార్ డివైఎఫ్ఐ నాయకులు, అభినవ్ ఎస్ఎఫ్ఐ నస్పూర్ మండల కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.