బాలల సంరక్షణ కేంద్రంలో సందర్శించిన కమిటీ చైర్మన్

Published: Friday May 21, 2021

వలిగొండ ప్రజా ప్రతినిధి గురువారం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఛైర్మన్ మరియు సభ్యులు వలిగొండ మండల కేంద్రంలోని శాంతి నిలయం బాలల సంరక్షణ కేంద్రంను సందర్శించడం జరిగింది. ఈసందర్బంగా కరోనా బారినపడి తలిదండ్రులను కోల్పోయిన బాలబాలికల కోసం మరియు కరోనా బారినపడి పిల్లల రక్షణ మరియు సంరక్షణ కరువైన పిల్లలకోసం యాదాద్రి భువనగిరి జిల్లాలోని 2 ట్రాన్స్ సిట్ హోమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మండల కేంద్రంలోని శాంతి నిలయం బాలల సంరక్షణ కేంద్రం బాలికలకు, మరియు చౌటుప్పల్ లోని ఫైత అండ్ వర్క్ బైబిల్ అసోసియేషన్ బాలల సంరక్షణ కేంద్రం బాలురకు అందుబాటులో ఉంటాయని, పిల్లలకు మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం జరుగుతుందని, ఆపదలో ఉండి రక్షణ సంరక్షణ అవసరమైన బాలబాలికల కోసం 1098 చైల్డ్ లైన్ మరియు బాలల సహాయవాణి 040-23733665 టోల్ ఫ్రీ నెంబర్లు అందుబాటులో ఉంటాయని, కావున ఈ సేవలను అవసరమైన వారు ఉపయోగించుకోవాలని అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బండారు జయశ్రీ, సభ్యులు మల్లేశ్, శివరాజు, జిల్లా బాలల పరిరక్షణ అధికారి పి.సైదులు, అలివేలు, మత్యగిరి తదితరులు పాల్గొన్నారు.