ప్రధాని మోడీ పర్యటనకు అధిక జన సమీకరణ చేయాలి జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు కోటపర్తి సుదర్శన

Published: Saturday April 08, 2023

బోనకల్, ఏప్రిల్ 7 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రంలో జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడు తాళ్లూరి సురేష్ అధ్వర్యంలో ఖమ్మం జిల్లా ఎస్సీ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశం శుక్రవారం బొనకల్ మండల కమిటీ అధ్యక్షతన రావినుతల గ్రామంలో జరిగినది.రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కొప్పు భాషా ఆదేశాల మేరకు జిల్లా ఎస్సి మోర్చా జిల్లా అధ్యక్షులు కోటపర్తి సుదర్శన్ మాట్లాడుతూ ఎస్సీ మొర్చా బలోపితం గురించి దళితులను చైతన్య పరచాలని 2024లో బిజెపి అధికారమే పరమావధిగా పని చేయాలని సూచించారు.ఈనెల 14న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని 13వ తారీఖున ఖమ్మం నగరంలో నిర్వహించే బైక్ ర్యాలీలో అధిక సంఖ్యలో పాల్గొని బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ ఆదేశాల మేరకు ప్రధాని మోడీ పర్యటన ఉద్దేశించి భారీ ఎత్తున సమీకరణ చేయాలని కోరుతూ నేడు ఉదయం 11 గంటలకు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర సికింద్రాబాద్ లో సుమారుగా 11 వేల కోట్లు అభివృద్ధిపనులకు ప్రారంభోత్సవానికి చేయుచున్నారని తెలియచేస్తూ ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ పెరేడ్ గ్రౌండ్లో భారీ ఎత్తున అతిపెద్ద బహిరంగ సభ నిర్వహిస్తున్నది. కావున ఈ సభకు బొనకల్ మండలము నుంచి పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రధాని నరేంద్ర మోడీ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క భారీ బహిరంగ సభ ను విజయవంతం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యుల చింతమల్ల వీరాస్వామి, జిల్లా దళిత మోర్చా అధ్యక్షుడు పుట్టపర్తి సుదర్శన్, దళిత మోర్చా కార్యదర్శి దేవరకొండ కోటేశ్వరరావు, మోదుగుల చిన్నికృష్ణ, గుడేటి వెంకటేశ్వరరావు, ఓ బి సి జిల్లా కార్యదర్శి జంపాల రవి, యువమొర్చా జిల్లా కార్య దర్శి పృద్వి రాజ్ మండల అధ్యక్షులు వీరపనేని అప్పారావు, యువ మోర్చా మండల అధ్యక్షులు కాలాసాని పరుశురాం, రవినూతల బూత్ అధ్యక్షులు తాళ్లూరి కిషోర్, చింతకాని బిజెపి నాయకులు సికిందర్ కార్యకర్తలు పాల్గొన్నారు.