సి ఐ టి యు దేశ వ్యాప్త సమ్మె పోస్టర్ ఆవిష్కరణ

Published: Saturday March 26, 2022
బోనకల్, మార్చి 25 ప్రజాపాలన ప్రతినిధి: సి ఐ టి యు దేశ వ్యాప్త సమ్మె జయప్రదం చేయాలి అంటూ బోనకల్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రంలో దేశవ్యాప్త సమ్మె పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు బోనకల్ మండల కార్యదర్శి బోయినపల్లి వీరబాబు మాట్లాడుతూ స్వాతంత్రానికి ముందు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, నాలుగు లేబర్ కోళ్లను రద్దుచేయాలని, ఈ నెల మార్చి 28 29 తేదీల్లో జరిగే రెండు రోజుల దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని కేంద్ర కార్మిక సంఘాలు, జాతీయ ఫెడరేషన్ అసోసియేషన్లు, అఖిలభారత కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ పిలుపునిచ్చాయి. అదేవిధంగా 1996 చట్టాన్ని తొలగించకుండా అమలు చేయాలని, ఓ హెచ్ ఎస్ కోడ్ లను 2020 లొ కలపొద్దని,1979 వలస కార్మికుల చట్టం,1996 భవన నిర్మాణ కార్మికుల కేంద్ర చట్టం,1998 సేస్సు చట్టాలను రక్షించుకోవాలని, పెన్షన్ స్కీమ్ అమలుకు కేంద్రమే బడ్జెట్ ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు, నిర్మాణం లో వాడే ముడిసరుకుల ధరలు పై జిఎస్టి తొలగించాలని, సెంట్రల్ వెల్ఫేర్ బోర్డు తిరిగి పునర్నిర్మించాలని, కేంద్ర బడ్జెట్ లో అసంఘటిత కార్మికులకు సోషల్ సెక్యూరిటీ కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు ఎస్కే ఖాదర్ బాబా (బుజ్జి), భవన నిర్మాణ కార్మికులు ఎస్.కె మీరాస, గద్దె వెంకటేశ్వర్లు, పుల్లయ్య, రాము, కనకయ్య, వెంకటేశ్వర్లు, గంగుల కృష్ణయ్య, ముక్కాల రాము, రామారావు, హుసేని, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.