ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతా * కౌన్సిలర్ చిట్యాల అనంత్ రెడ్డి

Published: Monday November 14, 2022
వికారాబాద్ బ్యూరో 13 నవంబర్ ప్రజా పాలన : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 15వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని కౌన్సిలర్ చిట్యాల అనంతరెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం 5:00 గంటల నుండి 11:00 గంటల
వరకు మార్నింగ్ వాక్ లో భాగంగా సాకేత్ నగర్, కమల్ నగర్, కార్తికేయ నగర్, మారుతి నగర్, ఎన్నెపల్లి కాలనీవాసుల ఇంటింటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ చిట్యాల అనంతరెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ సిబ్బంది శానిటేషన్ డ్రైవర్లు చెత్త సేకరణలో నిర్లక్ష్యం వహించరాదని హెచ్చరించారు.
మున్సిపల్లో పనిచేసే శానిటేషన్ సిబ్బంది చెత్త సేకరణ, వార్డు  పరిశుభ్రతలో నిబద్ధతతో పనిచేసి కాలనీ వాసులకు సహకరించాలని కోరారు. శానిటేషన్ సిబ్బంది ప్రజలతో కలగోలుపుగా మాట్లాడుతూ చెత్తను సేకరించాలని, ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా జాగ్రత్త పడాలని, చెత్త సేకరణలో నిర్లక్ష్యం వహించరాదని సూచించారు. మున్సిపల్ సిబ్బంది వార్డులో మురికి కాలువలు శుభ్రం చేశారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న మొక్కలను తొలగించారు. ఓపెన్ జిమ్ పార్క్ లో గల మొక్కలను తొలగించడం జరిగింది. కాలనీలో ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరిస్తారని, సిసి రోడ్డు పనులను తొందరగా చేపడతామని కౌన్సిలర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు నాగన్న ఉదయ్ పంతులు రఘునందన్ విఠల్ కృష్ణ సతీష్ కుమార్ పండరినాథ్ డేవిడ్ మున్సిపల్‌ శానిటేషన్ డ్రైవర్లు, సిబ్బంది తదితరులు  పాల్గొన్నారు.