రూపురేఖలుమారినమధిర నియోజక వర్గంజిల్లా తొలి మంత్రిని అందించినఘనత

Published: Thursday March 09, 2023

మధిరదేమధిర మార్చి 8 (ప్రజాపాలన ప్రతినిధి ) వ్యవసాయఆధారితప్రాంతమైనమధిరనియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతంగాకొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అతి సమీపంలో మధిర నియోజకవర్గం లోని పలు గ్రామాలు సరిహద్దుగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి 70 కిలోమీటర్ల దూరంలో, ఖమ్మం జిల్లా ప్రధాన కేంద్రం ఖమ్మం పట్టణానికి 60 కిలోమీటర్ల దూరంలో మధిర పట్టణం ఉంది. మధిర ప్రాంతం మీదుగా జాతీయ రైల్వే లైన్ ఉంది.మధిరనియోజకవర్గం నేపథ్యంఖమ్మం జిల్లా ఏర్పడక ముందు పూర్వపు వరంగల్ జిల్లాలో అతిపెద్ద తాలూకా కేంద్రంగా మధిర ఉంది. 1953 అక్టోబర్ 1న ఖమ్మం జిల్లా ఏర్పడిన తర్వాత కూడా మధిర అతిపెద్ద తాలూకా కేంద్రంగా ఉంది. 1952లో మధిర నియోజకవర్గం 84 గ్రామాలతో కలిసి ఏర్పడింది. మండల వ్యవస్థ ఏర్పడిన తర్వాత మధిర నియోజకవర్గంలో మధిర, ఎర్రుపాలెం, బోనకల్, వైరా తల్లాడ మండలాలు ఉన్నాయి. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో మధిర నియోజకవర్గ నుండి వైరా తల్లాడ మండలాలు వేరు కాగా, కొత్తగా చింతకాని ముదిగొండ మండలాలు చేరాయి.పెరిగిన విద్యా సౌకర్యాలుమధిర పట్టణంలో రైతులకు లాభసాటి విత్తనాలను అందించేందుకు 1945లో 40 ఎకరాల్లో వ్యవసాయ పరిశోధన స్థానాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలో మొట్టమొదటిసారిగా 1958లో ప్రభుత్వం బేసిక్ ట్రైనింగ్ స్కూల్ ఏర్పాటు చేసింది. దీనిలో శిక్షణ పూర్తి చేసిన వారు అనేకమందిఉపాధ్యాయులుగా పనిచేశారు. ఆ తర్వాత దీనిని డైట్ కాలేజీగా పేరు మార్చి 1978లో ఖమ్మం కు తరలించారు. మధిరలో ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలతో పాటు వ్యవసాయ పాలిటెక్నికల్ కళాశాల ఉన్నాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశారు. ప్రైవేటు రంగంలో సుశీల, భరత్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో బీఈడీ, టిటిసి కళాశాలలు ఏర్పాటు చేశారు. నాగేంద్ర ఐటిఐ