తెలంగాణ సాయుధ పోరాటానికి అసలు సిసలైన వారసులు కమ్యూనిస్టులే సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు

Published: Tuesday September 13, 2022

బోనకల్, సెప్టెంబర్ 12 ప్రజా పాలన ప్రతినిధి: కమ్యూనిస్టుల త్యాగఫలమే తెలంగాణ ప్రాంత విలీనమని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తోట రామాంజనేయులు పేర్కొన్నారు. సోమవారం మండలంలోని చిరునోముల గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు తామ్రపత్ర గ్రహీత స్వాతంత్ర సమరయోధులు రావెళ్ల జానకి రామయ్య స్థూపానికి సిపిఐ జిల్లా సమితి సభ్యులు తూము రోషన్ కుమార్ తో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..తెలంగాణ సాయుధ రైతాంగ విమోచన దినం అని కొంత మంది విద్రోహం అని అంటున్నారని, కానీ వాస్తవానికి అది విలీనం అన్నారు. బీజేపీ నాయకులు చరిత్రను వక్రీకరించడం సరికాదని విమర్శిస్తూ తెలంగాణ సాయుధ పోరాటానికి అసలు సిసలైన వారసులు కమ్యూనిస్టులు మాత్రమేనని ఆయన అన్నారు. అసలు తెలంగాణ సాయుధ పోరాటం చేసేనాటికి బిజెపి పార్టీ ఏర్పడలేదని, ఆర్ఎస్ఎస్ ఏర్పడిన సాయుధ పోరాటానికి మద్దతు ఇవ్వలేదన్నారు. అసలు సాయుధ పోరాటంలో పాత్ర లేని నాయకులు ఇప్పుడు విమోచన దినం అనడం చరిత్రను వక్రీకరించడంమేనన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం 1945 నుండి 1947 మధ్య కాలంలో సుమారు మూడు వేల గ్రామాలను నిరంకుశ పాలన నుంచి విముక్తి చేసిందన్నారు.ఈ ఉద్యమంలో అనేక మంది కమ్యూనిస్టు పార్టీ నాయకులు కార్యకర్తలు అమరులయ్యారన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం, ఎర్రజెండా తో నిజాం సైన్యాన్ని గడగడలాడించిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీ ల దేనన్నారు. ఈ పోరాటం వల్ల నాటి తెలంగాణ ప్రాంతంలోని గ్రామాలన్నీ కమ్యూనిస్టుల చేతుల్లోనే వచ్చాయని, పేద ప్రజలకు 10 లక్షల ఎకరాల భూమిని పంచడం జరిగిందని, ఒక హైదరాబాదు నగరం తప్ప మిగిలిన ప్రాంతం అంతా కమ్యూనిస్టుల చేతుల్లోనే ఉందని, హైదరాబాద్ స్టేట్ కమ్యూనిస్టుల వస్తే ఏమవుతుంది అని తెలుసుకున్న నాటి కాంగ్రెస్ 1948 సెప్టెంబర్ 17న నిజం సైన్యంను పంపి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఈ చరిత్రను ప్రస్తుత యువత తెలుసుకోవాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి యంగల ఆనందరావు, మండల నాయకులు మాతంగి శ్రీనివాసరావు, ఆకెన పవన్ తదితరులు పాల్గొన్నారు.