ఘనంగా జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు వసంత రాణి వివాహ వార్షికోత్సవ వేడుకలు

Published: Friday May 20, 2022

మధిర మే 19 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు వసంత రాణి వివాహ వార్షికోత్సవ వేడుకలు గురువారం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ దళిత విభాగం ఖమ్మం జిల్లా అధ్యక్షులు మద్దెల ప్రసాదరావు నివాసంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా మద్దెల ప్రసాదరావు రాజమణి దంపతులు ఏర్పాటు చేసిన వివాహ వార్షికోత్సవ కేకును లింగాల కమల్ రాజు వసంత రాణి చేతులమీదుగా కట్ చేశారు. ఈ సందర్భంగా బాణాపురం విచారణ ఆర్సీఎం చర్చి ఫాదర్ తప్పేట శౌరి ప్రత్యేక ప్రార్థనలు చేసి కమల్ రాజ్ దంపతులను ఆశీర్వదించారు అనంతరం పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయవాదుల సంక్షేమ సంఘం డైరెక్టర్ పాముల దానయ్య డోర్నకల్ డయాసిస్ సెక్రెటరీ లింగాల జ్యోతి మోహన్ రావు దంపతులు ఫార్మసిస్ట్ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి మద్దెల కల్పన సురేష్ దంపతులు మద్దెల నవి దివ్య చిన్ని సుజాత మద్దెల జయరాజు వజ్రమ్మ దంపతులు పాల్గొన్నారు