నవ చైతన్యం యూత్ అసోసియేషన్ నూతన కమిటీ ఏర్పాటు

Published: Wednesday July 28, 2021
కమిటీ సభ్యులు ఐకమత్యంగా ఉంటూ కాలనీ అభివృద్ధికి సహకారం ఇవ్వాలి
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని తాజ్ నగర్, సోఫా కాలనీ సొసైటీ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర బిజెపి నాయకులు రవి కుమార్ యాదవ్, గచ్చిబౌలి కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అర్బన్ గిరిజన మోర్చా అధ్యక్షులు హనుమంతు నాయక్, కొత్తగా ఎన్నుకోబడిన యూత్ కమిటీ సభ్యులను, ఎన్టీఆర్ నగర్ అసోసియేషన్ సభ్యులను ప్రకటించడం జరిగింది. అనంతరం నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్ మెమొంటో ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా సమస్యలపై మాట్లాడుతూ ఎన్టీఆర్ నగర్ కాలనీలో ఇంటి నెంబర్లు లేక ఇళ్ళు కట్టుకోలేని దుస్థితిలో ఉన్నామని, డ్రైనేజీ, రోడ్లు, మంచి నీటి వ్యవస్థ, కలుషితమై, కాలనీలో రేషన్ షాప్ లేక నానక్రామ్గూడా వెళ్లి రేషన్ తీసుకోవాల్సి వస్తుందని, ఎలక్షన్ వస్తే ఓటు వేయడానికి గోపన్ పల్లి  వెళ్లాల్సి వస్తుందని, స్మశాన వాటిక కూడా లేదని, బస్తీ దవాఖాన ఇలా చెప్పుకుంటూపోతే ఫైనాన్స్ జిల్లా లో ఉండి కూడా ఈ సమస్యలు ఎదుర్కొంటున్నాము. ఈ విషయాలపై దృష్టి పెట్టి కాలనీ అభివృద్ధికి కృషి చేయాలని, కాలనీ అధ్యక్షులు విట్టల్, నర్సింహారెడ్డి, నాగ సుబ్రహ్మణ్యం, రామ్ చందర్ తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీ అస్తవ్యస్తంగా ఉన్నందున బస్తీవాసులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని కార్పొరేటర్ దగ్గర మొరపెట్టుకున్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి ఎప్పుడూ ముందుంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ యూత్ ఆధ్వర్యంలో ఎన్నుకోబడిన సభ్యులు కాలనీలను చైతన్యవంతం చేసి కాలనీ సమస్యలపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ కాలనీ అభివృద్ధి కొరకు నాగ సుబ్రహ్మణ్యం  అహర్నిశలు శ్రమిస్తున్నారని వారిని కొనియాడారు. ఇదే స్ఫూర్తితో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో శేర్లింగంపల్లి నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని, అందుకు ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తెలియజేశారు. కొత్త యూత్ కమిటీ మెంబర్స్ ప్రెసిడెంట్ చైతన్య, వైస్ ప్రెసిడెంట్ నవీన్, జనరల్ సెక్రటరీ దుర్గారావు, జాయింట్ సెక్రటరీ కె నాగేంద్ర, ట్రెజరర్ కే. శ్రీను, ఆర్గనైజర్ ఆర్ రవీందర్, అడ్వైజర్ ఇన్ మనోజ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ రాము, సాయిరాం, విక్కీ, శివ. అదేవిధంగా ఎన్టీఆర్ నగర్, తాజ్ నగర్, సోఫా కాలనీ సొసైటీ మెంబర్స్ అధ్యక్షులు బి విటల్ , కార్యదర్శి నరసింహారెడ్డి, కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శి నాగ సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులు ఎం రామ సుధీర్ బాబు, శంకర్ నాయక్, సహాయ కార్యదర్శి విజయ్, మహమ్మద్ ఖలీల్, ఆర్గనైజర్ కార్యదర్శి సత్యవతి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ నగేష్, నాగేశ్వరరావు, కె రామచందర్, షేక్ బాబా, కే సత్యనారాయణ, ఏం చంద్ర. నవ చైతన్యం యూత్ అసోసియేషన్ నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలుపుతూ కమిటీ సభ్యులను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో యువకులు, కాలనీ సభ్యులు, బిజెపి పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.