పీలారం గ్రామంలో మిషన్ భగీరథ నిర్లక్ష్యం

Published: Monday August 23, 2021
వికారాబాద్ బ్యూరో 22 ఆగస్ట్ ప్రజాపాలన : తాగునీటి కష్టాలను తీర్చేందుకు చేస్తున్న కృషి అభినందనీయం. కానీ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం దురదృష్టకరం. పైప్లైన్ కొరకు తవ్విన గుంతలు కురసగా పోవడంతో చీకట్లో నడవడానికి జంకుతున్న జనం. మిషన్ భగీరథ లీలలు ఇంతింత కాదు. బాటసారుల పట్ల యమగండాలుగా మారుతున్న మిషన్ భగీరథ పైప్ లైన్ గుంతలు. వికారాబాద్ మండలానికి చెందిన పీలారం గ్రామంలోని 5వ వార్డులో వార్డు మెంబర్ కెరెల్లి గీత ఇంటి ముందు తవ్విన గుంత. నీటి పైప్ లైన్ కోసం తవ్విన గుంతలో పైప్ లైన్ వేసిన తరువాత గుంతను వెంటనే పూడ్చాలి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలకు సంకటంగా మారింది. సంబంధిత కాంట్రాక్టర్, మిషన్ భగీరథ ఏఈ స్పందించి గుంతను పూడ్చాలని కెరెల్లి బాలమ్మ కోరుతుంది. మానవీయ కోణంలో ఆలోచించి వెంటనే తవ్విన గుంతను పూడుస్తారని ఆశ.