పదవ వ రోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అల్పాహారం

Published: Friday June 11, 2021
మధిర, జూన్ 10, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీమధిర ప్రభుత్వ వైద్యశాల నందు కరోనా టెస్ట్లో, CPS  స్కూలు నందు టీకా వేయించుకున్న వారికి సిపిఎం పార్టీ మధిర టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అల్పాహారం కార్యక్రమం.. పదవ రోజు కూడా కొనసాగింది.. ఈ కార్యక్రమాన్ని పార్టీ టౌన్ కార్యదర్శి శీలం నరసింహారావు, ప్రారంభించారు.. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మధిర మండలంలోని వివిధ గ్రామాల నుండి మధిరకు టెస్ట్లో, టీకా వేయించుకోవడానికి వస్తున్నారని వారికి ఇబ్బంది.. కలగకుండా ఉదయం టిఫిన్ కార్యక్రమాన్ని ప్రారంభించామని, ఇప్పటికే చాలా కాలం నుండి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వివిధ రకాల కార్యక్రమాన్ని నిర్వహించి కరోన బాధితులను ఆదుకున్నామన్నారు. కరుణ తో బాధపడుతోన్న ప్రజలకు హెల్ప్లైన్ సెంటర్ల ద్వారా ఆదుకోవటానికి సిపిఎం పార్టీ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు టెస్టులు పెంచాలని కరోన టీకాలను తొందరగా వేసి కరోనా బారిన పడకుండా ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.. కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చి పేద మధ్యతరగతి ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.. టేకాఫ్ ఎంచుకునేవారు CPS స్కూలుకి వందల మంది రావటంతో అక్కడ కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉంది కావున గ్రామాల్లో టీకాలు వేసే కార్యక్రమం మరియు మధిర టౌన్ వార్డులవైజ్గా టీకా వేసే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మధిర టౌన్ కమిటీ సభ్యులు టీ రాధాకృష్ణ, పడకంటి మురళి, SFI ఖమ్మం జిల్లా అధ్యక్షుడు వడ్రాణపు మధు, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మద్దాల ప్రభాకర్, డివైఎఫ్ఐ మండల కార్యదర్శి సైదులు, ధనలక్ష్మి సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు...