చెత్త ఆటో లు ప్రారంభించిన సర్పంచ్ శీఖ కృష్ణ వేణి

Published: Tuesday January 12, 2021
సుజాతనగర్ గ్రామపంచాయతీ లో సోమవారం తడి చెత్త పొడి చెత్త సేకరించుట కు రెండు ఆటో ట్రాలీ లు ఎనిమిది లక్షల రూపాయలు తోటి కొనుగోలు చేసిన వాటిని సుజాతనగర్ సర్పంచ్ శిఖ కృష్ణవేణి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది అదేవిధంగా 3200 డబ్బాలను గ్రామంలో ప్రతి ఇంటికి ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆమె అన్నారు మన ఊరు మన గ్రామం మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఇకనుంచి రోడ్ల మీద చెత్త వేయడం గానీ వీధులను అపరిశుభ్రంగా ఉంచకూడదు అని ఆమె అన్నారు తెలంగాణ ప్రభుత్వం పల్లెలు పచ్చగా ఉండాలంటే పరిశుభ్రంగా ఉండాలని ఎన్నో కార్యక్రమాలను సీఎం కేసీఆర్ మన ముందుకు తీసుకు వచ్చారన్నారు మన వంతు బాధ్యతగా మనం కూడా మన ఊరు మన వాడ మన గల్లీ పరిసరాల   శుభ్రంగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా వివరించారు ప్రజలు చెత్త బండ్లు ఇంటి ముందుకు వచ్చినప్పుడు పంచాయతీ వారికి సహకరించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ శిఖ కృష్ణవేణి ఉప సర్పంచ్ లింగం చిన్న పిచ్చి రెడ్డి సెక్రెటరీ నరేంద్ర ప్రసాద్ ఎంపీడీవో వెంకటలక్ష్మి ఎంపీపీ విజయలక్ష్మి ఎంపీటీసీ పెద్ద మల్ల శోభారాణి  పంచాయితీ గుమస్తా లక్ష్మణ్ వార్డు మెంబర్లు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు