ధనిక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన సీఎం కేసీఆర్

Published: Friday March 12, 2021
తెలంగాణ టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ
వికారాబాద్ జిల్లా, ప్రతినిధి మార్చి 11 ( ప్రజాపాలన ) : తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నప్పుడు ధనిక రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని నేడు టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందని తెలంగాణ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ అభ్యర్థి రమణ విమర్శించారు. గురువారం మున్సిపల్ పరిధిలోని క్లబ్ వేడుక వేదికలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ప్రచారాన్ని జిల్లా అధ్యక్షుడు సుభాష్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరు నమోదు కార్యక్రమంలో పెద్ద ఎత్తున నిర్వహించామని గుర్తుచేశారు. పార్టీ గుర్తుతో పోటీ చేసే ఎన్నికలు కావని, అభ్యర్థి పేరుతో పోటీ చేసే ఎన్నికలని పేర్కొన్నారు. కష్టసుఖాల్లో ప్రజలకు చేదోడువాదోడుగా నిలిచి వారి సమస్యలను పరిష్కరించే నాయకుని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఎందరో రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పట్టించుకున్న పాపాన పోలేదని సీఎం కేసీఆర్ ను విమర్శించారు. రైతు శ్రేయస్సు కోరి రైతు బీమా పథకాన్ని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టామని అన్నారు. నిరుపేదలు పేదల బతుకులు బాగు చేసే పార్టీ టిడిపి అని ఘంటా పథంగా చెప్పారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ధరల నియంత్రణ అదుపు చేయలేక చేతులెత్తేసిన చేతగాని ప్రభుత్వమని విమర్శించారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ లను జిఎస్టిలో కలిపి ఉంటే ధరలు అదుపులోకి వచ్చేవని గుర్తు చేశారు. ఈ సమావేశంలో ఇన్చార్జి జానకిరాములు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ నాయకులు దివాకర్ నరసింహులు సిరాజుద్దీన్ బాబా ఖాన్ అర్జున్ రెడ్డి శేఖర్ యాదవ్ తదితర టిడిపి నాయకులు పాల్గొన్నారు.