అత్యాచార నిందితుడిని బహిరంగంగా ఉరిశిక్ష అమలు చేయాలి : తెలంగాణ ప్రజాబందు పార్టీ రాష్ట్ర ఉపాధ

Published: Wednesday September 15, 2021
బెల్లంపల్లి, సెప్టెంబర్ 12, ప్రజాపాలన ప్రతినిధి : హైదరాబాదులోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరు సంవత్సరాల గిరిజన బిడ్డ అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని వెంటనే బహిరంగంగా ఉరిశిక్ష అమలు చేయాలని తెలంగాణ ప్రజాబందు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజుప్రకాష్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సంఘటన ను ప్రజాబందు పార్టీ తీవ్రంగా కండిస్తున్నట్లు అయన పేర్కొన్నారు. అభం శుభం తెలియని అమాయక గిరిజన చిన్నారి ని హత్య చేయడం అమానుషమని, నిందితున్ని కఠినంగా శిక్షించి నప్పుడే బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం జరుగుతుందన్నారు. "దిశ" కేసులో జరిగిన న్యాయమే చిన్నారి విషయంలో జరగాలన్నారు, బాధిత కుటుంబ సభ్యులకు డబుల్ బెడ్ రూమ్ తో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగము, 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. బాలికలపై, మహిళల పై జరుగుతున్న దాడులను సమర్థవంతంగా అరికట్టాలని, ఇందుకోసం ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, హోం శాఖ మంత్రి, డీ జి పి వెంటనే స్పందించి చైత్ర కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.