పాస్టర్ హనీ జాన్సన్ అక్రమ అరెస్టును ఖండిస్తునాం

Published: Wednesday August 25, 2021
బోనకల్లు, ఆగష్టు 24, ప్రజాపాలన ప్రతినిధి : పాస్టర్ హనీ జాన్సన్ ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ స్థానిక బోనకల్ మండల పాస్టర్ ఫెలోషిప్ కమిటీ తరఫున స్థానిక బోనకల్ మండలం తాసిల్దార్ రాధికకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ విశాఖపట్నం పాస్టర్ హనీ జాన్సన్ ను తెలంగాణ పోలీసులు అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేసి చంచల్ గుడా పోలీస్ స్టేషన్ లో రిమాండ్లో ఉంచారని పాస్టర్ మీద తప్పుడు కేసులు బనాయించి మానసికంగా హింసించి కొందరు మత విద్వేష కులు క్రైస్తవులను హక్కులను మా యొక్క హక్కులను హరిస్తున్నారని యూట్యూబ్ లో ఒక సహోదరీ బైబిల్ కు వ్యతిరేకంగా  మాట్లాడుతూ క్రైస్తవులను కించపరిచే  విధంగా హేళన చేయగా ఆ ఘటనపై వివరణ ఇచ్చేందుకు హనీ జాన్సన్ అణచి వేయుట కొరకు అతని పై అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా అరెస్టు చేశారని బోనకల్లు మండల పాస్టర్ ఫెలోషిప్ కమిటీ తరఫున మండల క్రైస్తవుల అందరి తరపున ఖండిస్తున్నా మని అరెస్టు చేసిన పాస్టర్ హనీ జాన్సన్ ని వెంటనే విడుదల చేయాలని బోనకల్ మండల తాసిల్దార్ రాధికా కు వినతిపత్రం అందజేయడం జరిగింది ఇదే విషయం సీఎంకు తెలియజేసి మా క్రైస్తవులందరికీ రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బోనకల్ మండల ప్రెసిడెంట్ యమ్ కృపాకర్, సెక్రటరీ ఎం పాల్ ట్రెజరీ దేవరాజ్ మండలంలోని వివిధ గ్రామాల క్రైస్తవ మతపెద్దలు పాల్గొన్నారు.