ఐ.పీ.ఎస్ ప్రవీణ్ కుమార్ పై ఆరోపణలు మానాలి

Published: Saturday March 20, 2021
బాలాపూర్ : (ప్రతినిధి) ప్రజాపాలన న్యూస్ : డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ లో పదునైన జ్ఞానం అని కత్తితోనే ఈ దేశంలో సమానమైన హక్కులను ప్రతి ఒక్కరికి నిరూపించిన గొప్ప మహానుభావులు, వారి సిద్ధాంతాల ప్రకారం ముందుకెళ్తున్న వారసులం అందుకు నిదర్శనం ఐ.పీ.ఎస్ ప్రవీణ్ కుమార్. వారి పై అనుచిత వ్యాఖ్యలు అన బీజేపీ రాష్ట్ర బండి సంజయ్ కుమార్ క్షమాపణ చెప్పాలినీ, బడంగ్ పేట్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. బాలాపూర్ మండలం బడంగ్ పేట్ కార్పొరేషన్ కార్యాలయంలో శుక్రవారం నాడు బి ఎస్ పి రాష్ట్ర నాయకుడు  కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్, కార్పొరేటర్లు పార్టీలకు అతీతంగా జాతికి అంకితం భావనతో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు అర్జున్, కృష్ణ, జైహింద్ (షాడ), మాట్లాడుతూ..... ఆనాటి కాలంలో అగ్రవర్ణాలు వాళ్ళందరూ గుడి గోపురాల దగ్గరికి, ఊర్లోకి రానివ్వని వాళ్లు ఈలా వ్యవహరిస్తున్నారని తెలిసి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్పూర్తితో ప్రతి ఒక్కరికి అనగారవర్గాలు చదువుకోవాలనే దృక్పథంతో ఆశయాలతో ఈనాటి ప్రభుత్వ పాఠశాలలో కాకుండా గురుకుల పాఠశాలల సెక్రెటరీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ చక్కటి విద్యావిధానాన్ని అందిస్తున్న భావనతో ఉన్నారు. వారిని అనుచిత వ్యాఖ్యలతో అనడం నీకు తగునా... అని ప్రశ్నించారు...? బిజెపి బండి సంజీవ్ వారిపై దుర్భాషలాడిన మాటలను వెనక్కి తీసుకొని, క్షమాపణ చెప్పాలని, పార్టీలకు అతీతంగా జాతికి అంకితభావంతో ముక్తకంఠంతో కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తపరిచారు. అనంతరం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్ మాట్లాడుతూ. గురుకుల పాఠశాలల సెక్రెటరీ అయినటువంటి ఐ.పీ.ఎస్ ప్రవీణ్ కుమార్ పై చేసిన ఆరోపణలు వెంటనే వెనక్కి కి  తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ, మేము ఒక రాజకీయ పార్టీల అతీతంగా కాకుండా జాతికి అంకితభావంతో ఐపీఎస్ ప్రవీణ్ కుమార్చే స్తున్న ప్రతి విద్యార్థి విద్యార్థులకు విద్య ద్వారానే సమాజం లో ఉన్నత స్థాయికి ఎదిగి ఆర్థిక అసమానత ను రూప్ మ్యాపి ఏదైతే వివక్షత ఉన్నదో ఆ వివక్షతను ప్రశ్నించే మనుషులుగా తయారుచేసే విధానంలో  అంబేద్కర్ ఆశయాలలో కొనసాగుతున్న ఐపీఎస్ ప్రవీణ్ కుమార్. ఈ భయం బిజెపి బండి సంజయ్ కు ఎందుకు వస్తుందో.....? అంటే అణగారిన వర్గాలు చదువుకో కూడదని భావన కలిగిన సిద్ధాంతాలలో ఉన్న బండి సంజయ్ ఆ దుర్భాషలాడిన మాటలను వెనక్కి తీసుకొని వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలా అంటే ఊరుకునేది లేదు. బండి సంజయ్ ఏ పార్టీ కి  లేని ఆవేదన... మీకెందుకు ఇలా విమర్శించడం తగునా ఎప్పుడో ఒకసారి దళిత ప్రవాహంలో కొట్టుకుపోతువూ..... జాగ్రత్తని హెచ్చరిస్తున్నారు. దేశంలో సమానమైన హక్కులను పొందుతూ ఈ దేశంలో పదునైన జ్ఞానం అనే కత్తితో విద్యార్థినీ విద్యార్థులను గురుకుల లో తయారు చేస్తున్న ప్రవీణ్ కుమార్ దేశంలోని అబద్ధాలకు...... నిజం తెలియజేస్తున్న వారిని ఇలా అనడం మంచిది కాదునీ యావత్ దళిత జాతి ఎదురొస్తుంది. జ్ఞానవంతులుగా విద్యార్థులు తయారవుతున్నారాని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ కార్పొరేటర్లు సూర్ణగంటి అర్జున్, ముత్యాల లలితా కృష్ణ, కాంగ్రెస్ పార్టీ ఎర్ర మహేశ్వరి జైహింద్, తదితరులు పాల్గొన్నారు.