నూతన కమిటీల ఎంపికలో మాదిగలకు తీవ్ర అన్యాయం

Published: Tuesday June 29, 2021

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజాపాలన ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీల ఎంపికలో మాదిగలకు తీవ్ర అన్యాయం-దండు నరేష్. ఈ సందర్భంగా  సంపతన్న యువసేన రాష్ట్ర అధ్యక్షులు, ఐ ఎన్ టి యు సి పట్టణ అధ్యక్షులు దండు నరేష్ మాదిగ మాట్లాడుతూ ఇటీవల తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడు మరియు ఇతర కమిటీల నియామకంలో తెలంగాణ రాష్ట్రంలో దళితుల్లో అతిపెద్ద సామాజిక వర్గం అయిన మాదిగ సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరిగింది ఇప్పటికే ఎబిసిడి వర్గీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాలు నడుస్తున్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే మాల సామాజిక వర్గానికి చెందిన సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క అలాగే నూతనంగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అదే మాల సామాజిక వర్గానికి చెందిన గీతారెడ్డి ని, మల్లు రవి ని నియమించడం, మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎవరిని కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించక పోవడం దురదృష్టకరం. ఇప్పటికే ఏఐసీసీ కార్యదర్శి గా ఉన్న తెలంగాణ యువ దళిత ఫైర్ బ్రాండ్ ఎస్ఏ సంపత్ కుమార్ శాసన సభ్యులుగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఎస్సీలకు గురించి గళం విప్పిన నాయకుడు అలాంటి నాయకుడిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తారని అందరు అనుకున్నారని, కానీ వారిని నియమించుకోవడం పైగా వయసు మీద పడి అనారోగ్యంతో ఉన్న 77 సంవత్సరాల వయస్సు ఉన్న గీతా రెడ్డి ని నియమించడం మాదిగ సామాజిక వర్గాన్ని తీవ్ర ఆవేదనకు గురి చేసిందని మాదిగ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అనుకుంటున్నారు. కాబట్టి అధిష్టానం ఇప్పటికైనా స్పందించి దళితుల్లో తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ సామాజిక వర్గమైన మాదిగ నాయకత్వాన్ని గుర్తించాలని అన్నారు.