వీఆర్ఏల సమస్యలు వెంటనే పరిష్కరించాలి లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం

Published: Friday July 29, 2022

ఇబ్రహీంపట్నం జూలై తేదీ 28 ప్రజాపాలన ప్రతినిధి.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీపట్నం మండల కేంద్రము తాసిల్దార్ కార్యాలయం వద్ద ఇబ్రహీంప్నంలో మండలానికి చెందిన వీఆర్ఏలు తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని డివిజన్ ప్రధాన కార్యదర్శి బుద్ధి రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన  నిరవధిక సమ్మె కార్యక్రమం పాల్గొనడం జరిగింది ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ వీఆర్ఏలకు ప్రగతి భవన్ అసెంబ్లీలో వీఆర్ఏల కు చెప్పిన మాటలు వెంటనే అమలు చేయాలని న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే  ఈ విధంగా చూడాలని వీఆర్ఏల స్కేల్ జీవోలను వెంటనే అమలు చేయాలని అర్థత కలిగిన వీఆర్ఏలను ప్రమోషన్ కల్పించి 55 సంవత్సరాల నుండిన వీఆర్ఏల స్థానంలో కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగాలు కల్పించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ పట్వారి రామ్ రెడ్డి మద్దతు ఇస్తూ ఈ సందర్భంగా మాట్లాడుతూ వీఆర్ఏలకు ప్రభుత్వం నుంచి వచ్చే స్కేల్ ఏదైతే ఉందో ప్రభుత్వం అమలుపరిచే విధంగా చూస్తుందని ఆయన వీఆర్ఏలకు తెలిపారు కెసిఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్న భాగంలోని వీఆర్ఏల కూడా తప్పకుండా న్యాయం చేస్తుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మండల వీఆర్ఏ జేఏసీ అధ్యక్షుడు చీమల కరుణేశ్వర్, ఉపాధ్యక్షులు పడాల ఇబ్రహీం, బుద్ధి యాదగిరి, రాజేందర్, కొమ్ము శివకుమార్,  సూరంపల్లి శ్రీను, అంకర్ల విష్ణు, దేవేందర్, భాస్కర్, దీప, జాఫర్, గాలయ్య, లింగస్వామి, బాలరాజ్, సునీత, హేమలత, పద్మ, జంగయ్య, పద్మ ,పుల్లయ్య, తదితరులు పాల్గొన్నారు