ప్రభుత్వ భూమిని అర్హులైన పేదలకు పంచాలి

Published: Tuesday November 22, 2022
జన్నారం, నవంబర్ 21, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని చింతగూడ గ్రామపంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 81 లో ఉన్న ప్రభుత్వ భూమిని ఆ గ్రామంలోని అర్హులైన పేదలందరికీ పంచాలని న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో పురంశేట్టి బాపు సోమవారం చింతగూడెం నుంచి మండల తాసిల్దార్ కార్యాలయం వరకు పెదలు కళినడకన భారీగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హులైన వారిని గుర్తించి వారికి ప్రభుత్వ భూములను ఇస్తూ ఆ భూములకు పట్టా ఇవ్వాలన్నారు. ప్రభుత్వ భూమికి గతంలో 150 మంది పెదలకు ఇంటి స్థలం పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు.  రెండవ దశలో మిగిలిన  200 మందికి ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఇప్పటివరకు నెరవేస్తే లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డిసెంబర్ వరకు ప్రభుత్వం పేదలకు  ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే జనవరిలో ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సెక్రటరీ టి శ్రీనివాస్, పి ఓ డబ్ల్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందె మంగ, ఐ ఎఫ్ టి ఎల్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, అరుణోదయ రాష్ట్ర కోశాధికారి  మల్లన్న, అరుణ, మల్లేష్, రాజం, రవిశంకర్, లింగన్న,  వెంకటన్న, పోషవ్వ, గంగమ్మ, తదితరులు పాల్గొన్నారు.