ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 13ప్రజాపాలన ప్రతినిధి

Published: Wednesday December 14, 2022

*బాలరాజుకు ఐదు ఏండ్లు జైలు 5 వేలు జరీమాన*

పోల్కంపల్లి గ్రామ వాసుకి 5 సంవత్సరాల జైలు శిక్ష,  డొమెస్టిక్ వాయిలెన్స్ కేసులో 5,000 రూ.జరిమానా విధించిన సంఘటన ఇబ్రహీంపట్నం మండలంలో  చోటుచేసుకుంది.
పోల్కంపల్లి గ్రామానికి చెందిన బాధితురాలు  కంబాలపల్లి జంగమ్మ భర్త  బాలరాజు, వయస్సు: 30 సం., పోల్కంపల్లి గ్రామం, ఇబ్రహీంపట్నం మండలం, రంగారెడ్డి జిల్లా.   బాలరాజు, వయస్సు: 35 సంవత్సరాలు వృత్తి  12 సంవత్సరాల నుండి ట్రాక్టర్ డ్రైవర్ మరియు వారికి ముగ్గురు కొడుకులు తరుణ్ చరణ్, భాను  మరో మహిళతో అక్రమ సంబంధం గురించి ఫిర్యాదుదారు ఆమె భర్తను అదుగగా  ఆ తర్వాత ఫిర్యాదుదారు జంగమ్మను  మానసికంగా
భౌతికంగా కట్నం కోసం వేధించగా  తన జీవితంపై విరక్తి చెంది, మంగళవారం ఆమె శరీరంపై కిరోసిన్ పోసుకుని, ఆమె నివాసం పోల్కంపల్లి గ్రామంలో నిప్పంటించుకుంది, ఫలితంగా ఆమె శరీరంపై కాలిన గాయాలయ్యాయి.  చికిత్స నిమిత్తం ఆమెను భర్త అంకిత్ ఆసుపత్రికి తరలించారు.  అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.  ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో ఉమెన్ బర్న్స్ వార్డులో చికిత్స పొందుతోంది. పై ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఎస్‌ఐ కె.శంకర్‌ చార్జిషీట్‌ దాఖలు చేశారు. మంగళవారం విచారణ సందర్భంగా  ఇబ్రహీంపట్నంలోని  అసిస్టెంట్ సెషన్స్ జడ్జి ఎదుట నిందితుడు కంబాలపల్లి బాల్‌రాజ్ తండ్రి లక్ష్మయ్య  కు  5 సంవత్సరాల జైలు శిక్ష, 5,000 రూ.జరిమానా  విధించడం జరిగింది.