జనకాపూర్ జిల్లా పరిషత్ పాఠశాలకు స్థలం కేటాయించాలి ** విద్యార్థి, సంఘాల డిమాండ్ **

Published: Saturday January 21, 2023
అసిఫాబాద్ జనవరి 20 (ప్రజాపాలన,ప్రతినిధి) :  ఆసిఫాబాద్ మండలంలోని జనకాపూర్ లొ గల జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలకు స్థలం కేటాయించగలరని విద్యార్థి యువజన సంఘాల నాయకులు శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయ ఏఓ రఫతుల్లాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జనకాపూర్ లోని పాఠాశాలలో దాదాపు 400 మందికు పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తూన్నారని,ఈ  పాఠశాలలొ తెలుగు మరియు ఆంగ్లము విద్యా బోధన జరుగుతుందన్నారు. కానీ వీరికి సరియగు తరగతి గదులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని. అంతేకాకుండా మౌలిక వసతులైన త్రాగునీరు మూత్రశాలలు కూడా అందుబాటులో లేకపోవడం చాలా బాధాకరమన్నారు. కాబట్టి పాఠశాలకు ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలాన్ని పాఠశాలకు కేటాయించాలని కోరారు.భవిష్యత్తులో విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో పాఠశాల నిర్మితమవుతుందని విద్యార్థి యువజన సంఘాల నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఆత్మకూరి చిరంజీవి, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్,డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గోడిసెల కార్తీక్, పిడిఎస్యు జగజంపుల తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.