షర్మిల పాదయాత్రతో టిఆర్ఎస్ లో వణుకుషర్మిల పాదయాత్రకు కోర్టు అనుమతి పట్ల హర్షం

Published: Wednesday November 30, 2022

మధిర రూరల్ నవంబర్ 29 (ప్రజా పాలన ప్రతినిధి) ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు వైయస్సార్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర తో అధికార టీఆర్ఎస్ పార్టీలో వణుకు ప్రారంభమైనదని వైయస్సార్ తెలంగాణ పార్టీ ఖమ్మం జిల్లా దళిత విభాగం అధ్యక్షులు పార్టీ మధిర నియోజకవర్గ కోఆర్డినేటర్ రిటైర్డ్ సీఐ డాక్టర్ మద్దెల ప్రసాదరావు ఆరోపించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చింతకాని ముదిగొండ మండల అధ్యక్షులు వాకా వీరారెడ్డి సామినేని రవితో కలిసి మంగళవారం మద్దెల ప్రసాద రావు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో పేదల పక్షాన పోరాడే వారు లేకపోవడంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యాన్ని స్థాపించడం కోసం ప్రజాప్రస్థానం పాదయాత్ర చేపట్టి 3500 కిలోమీటర్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అవినీతిని మరియు ప్రజా వ్యతిరేక విధానాలను వైఎస్ షర్మిల పాదయాత్ర జరుగుతున్న నియోజకవర్గాల్లో ఎండగట్టడం జరుగుతుందన్నారు. దీనిని ఓర్వలేని టిఆర్ఎస్ నాయకులు రౌడీలను గూండాలను రెచ్చగొట్టి షర్మిల పాదయాత్ర బస్సును దగ్ధం చేయటం జరిగిందని అక్రమంగా కేసులు పెట్టడం జరిగిందని ఆయన పేర్కొన్నారు అంతే కాకుండా పాదయాత్రను నిలిపి వేసేందుకు షర్మిలను అక్రమంగా అరెస్టు చేయడం జరిగిందన్నారు. దీనిని నిరసిస్తూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కోర్టును ఆశ్రయించడంతో వైఎస్ షర్మిల పాదయాత్ర యధావిధిగా నిర్వహించేందుకు అనుమతి ఇచ్చిందని ఆయన అన్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా పేదల పక్షాన వైఎస్ షర్మిల పోరాటం చేస్తారని ఆయన తెలిపారు.