పలు డివిజన్లలో ముమ్మరంగా హరితహారం

Published: Monday July 12, 2021
బాలాపూర్, జూలై 11, ప్రజాపాలన ప్రతినిధి : అనంతరం పేద బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులు, మొక్కలు పెంచడమే బాధ్యతగా భావించాలని కార్పొరేషన్ మేయర్ పేర్కొన్నారు. బడంగ్ పేట్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్, వెంకట పూర్, మల్లాపూర్ గ్రామాలకు సంబంధించిన 17వ, 16వ, 13వ, 14 వ, 15 వ, 18వ డివిజన్ లలో పట్టణ ప్రగతి, హరితహారం  కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ల తో కలిసి కార్పొరేషన్ అధికారులు, డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్, మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి వాళ్ళందరూ కలిసి మొక్కలు నాటారు. అనంతరం బడంగ్ పేట్ లోని మంత్రి పర్యటనలో పాల్గొని మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి. పేద బ్రాహ్మణులకు నిత్యావసర సరుకుల పంపిణీలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదగా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..... ఇంటింటికి ఆరు మొక్కలను పంపిణి చేయాలని సిబ్బందికి సూచించారు. వార్డు కమిటీలను పటిష్టం చేయాలని ఆమె అన్నారు. మొక్కలను పెంచడమే కాక వాటి సంరక్షణ బాధ్యతను ప్రతి ఒక్క పౌరుడు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్, కమిషనర్ కృష్ణ మోహన్ రెడ్డి, డీఈఈ అశోక్ రెడ్డి, కార్పొరేటర్లు వంగేటి ప్రభాకర్ రెడ్డి, ఎర్ర మహేశ్వరి జైహింద్, జెనిగే భారతమ్మ కోమరయ్య యాదవ్, బాలు నాయక్, బండారి మనోహర్, కో ఆప్షన్ సభ్యుడు రఘునందన చారి, ఏఈఈ బిక్కు నాయక్, నాయకులు బొర్ర జగన్ రెడ్డి, బ్రాహ్మణ సంఘ సభ్యులు మరియు వివిధ కాలనీల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, శానిటేషన్ సిబ్బంది, నగర దీపికలు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.