ఉప్పల్లో జీత్ క్రికెట్ అకాడమీని ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే బేతి సుభాష్

Published: Thursday February 17, 2022
మేడిపల్లి, ఫిబ్రవరి 16 (ప్రజాపాలన ప్రతినిధి) : క్రీడలు శరీర దారుడాన్ని పెంపొందించడంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కల్గిస్తాయని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ్, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. ఉప్పల్లోని ఆదిత్య హాస్పిటల్ సమీపంలో జీత్ క్రికెట్ అకాడమీ అధ్యక్షులు ఏ రామ్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన జీత్ క్రికెట్ అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ్, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ హాజరై ప్రారంభించారు. అనంతరం మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ క్రికెట్ తోపాటు వాలీబాల్, ఫుట్బాల్, స్విమ్మింగ్ పూల్ లాంటివి ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, క్రీడలు ఆడడం వల్ల మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యవంతంగా ఉంటారని గుర్తు చేశారు. క్రీడ మైదానాలు ప్రభుత్వ స్థలంలో ఉంటే అక్కడ నిర్వహించేందుకు పూర్తిగా సహకరిస్తామని తెలిపారు.ఈ సంధర్బంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్  క్రీడాకారులతో సరదాగా  క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సహ పరిచారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తెల్కల మోహన్ రెడ్డి, ఉప్పల్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వేముల సంతోష్ రెడ్డి, సీనియర్ నాయకులు గరిక సుధాకర్, చింతల నరసింహారెడ్డి, బన్నల ప్రవీణ్ ముదిరాజ్, బింగి భరత్, మస్కా సుధాకర్ స్వీట్ హౌస్ రాజు, అన్య వెంకటేష్, కంచర్ల సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.