ప్రజాపాలన ప్రతినిధి వైరా

Published: Tuesday July 19, 2022

కర్షకుని కాటేసిన కల్తీ విత్తనం"*

  *నకిలీ చీడ...అధికారులేడా..?*
*10న ఫిర్యాదు*..*16న పరిశీలన* 
*సాగు"కే"సవాల్"విసురుతున్న నకిలీ దందా..*
*మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న అధికారులు*
  
సూర్య మేజర్ న్యూస్:-నకిలీ విత్తనాలు తయారు చేసే కంపెనీల తాట తీస్తాం.ఫేక్ సీడ్స్ సరఫరా చేసే కంపెనీల భరతం పడతాం.చట్ట పరంగా కఠినంగా వ్యవహరిస్తాం.1966లో కేంద్రం రూపొందించిన విత్తన విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయి.వాటిని మార్చి చట్టాలు బలోపేతానికి చర్యలు తీసుకోవాలని లేఖరాస్తాం.విత్తనాలు నకిలీ కాకుండా నిరంతరం నిఘా పెట్టాం.పట్టుబడితే ఎంతటి వారినైనా వదలం.గత సంవత్సరం కాలంలో ఉన్నత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి శీతల గదిలో కూర్చొని మాట్లాడిన మాటలివి.కానీ క్షేత్రస్థాయిలో నేడు కొంతమంది అధికారులు ప్రవర్తిస్తున్న తీరు పూర్తి విరుద్ధంగా ఉంది.సంబంధిత శాఖ మంత్రి మాటల్ని కనీసం ఆ శాఖ అధికారులు కూడా ఊకదంపుడు ఉపన్యాసాలుగానెే భావించారొ ఏమో కానీ తమకు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు.వ్యవసాయ శాఖలో నేడు కొంతమంది అధికారులు నెలవారీ జీతం సరిపోనట్టు,మామూల మత్తుకు అలవాటు పడి నామమాత్రపు తనిఖీలతో స్టాక్ రిజిస్టర్ మాత్రమే పరిశీలనలతొ సరిపెడుతున్నారు.నకిలీ విత్తనాలతో తనకు నష్టం జరిగిందని కొద్దో గొప్పో లోక జ్ఞానం తెలిసిన రైతు ఫిర్యాదు చేస్తే తప్ప స్పందించని దుస్థితి నేడు జిల్లాలోని వ్యవసాయ శాఖ అధికారులొో నెలకొంది.ఒకవేళ రైతులు ఫిర్యాదు చేసిన అధికారులెే మధ్యవర్తులుగామాత్రమే కాకుండా ఇంకా దిగజారి రైతులకు,కంపెనీలకు మధ్య బ్రోకర్లుగా వ్యవహరిస్తున్న సంఘటనలు కోకొల్లలు.గత సంవత్సరం రబీ సీజన్లో తల్లాడమండల పరిధిలోని కుర్నవల్లి గ్రామంలోని కొంతమంది రైతులు వైరా లోని విత్తన వ్యాపారుల దగ్గర నుంచి తెచ్చిన నకిలీ వరి విత్తనాలు తెచ్చుకొని భూమిలో చల్లి మొలకలు రాకపోవడంతో, దిక్కుతోచని స్థితిలో అధికారుల నిర్లక్ష్యానికి రైతులకు జరగాల్సిన నష్టం జరిగిన విషయాన్ని పలు పత్రికల్లో ప్రకటించిన రాతపూర్వక ఫిర్యాదు తమకు రాలేదని సాకుతో ఓదార్పు మాటలతో రైతులకు విత్తన కంపెనీల మధ్య ఆర్థిక ఒప్పందం నడిచిందె తప్ప కనీసం అధికారులు విచారణ జరపటం కానీ,కంపెనీ మీద కాని,విత్తన షాపుల మీద కాని ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.రైతుల వద్ద నుంచి ఎన్ని ఫిర్యాదులు వస్తే తమకు అంత దండుకోవచ్చు అన్నట్లు కొంతమంది వ్యవసాయశాఖ అధికారులు వ్యవహరిస్తున్నరు అనేది జగమెరిగిన సత్యం అని రైతాంగం వాపోతోంది.ఇదే అదునుగా భావించిన కొంతమంది కేటుగాళ్లు కల్తీ విత్తనాలతో కర్షకుడు జీవితాలను కాటేస్తున్నారు.తల్లాడ మండల పరిధిలోని ముద్దునూరు గ్రామానికి చెందిన అనుమోలు రామారావు అనే రైతు తెలిసిన వివరాల ప్రకారం వైరా మండలంలోని పుణ్యపుర్ర౦ గ్రామ రెవెన్యూ పరిధిలో తనకున్న 5.07-కుంటల వ్యవసాయ భూమిలో పత్తి పంట వేయాలని వైరా మండలంలోని పినపాక గ్రామంలో ఉన్న వెంకటకృష్ణ ట్రేడర్స్ నందు ఈనెల మూడో తారీఖున అమర్ బయోటెక్ కంపెనీకి చెందిన ABCH 181వెరైటీ విత్తనాలను ఒక్కొక్కటి 750రూపాయల చొప్పున,సుమారు తొమ్మిది వేల రూపాయలు చెల్లించి పన్నెండు బ్యాగులను కొనుగోలు చేసి ఈనెల నాలుగవ తేదీన విత్తనాలను భూమిలో విత్తడము జరిగిందని తెలిపాడు.వారం రోజులు గడిచినా గాని 40% మాత్రమే విత్తనాలు మొలకెత్తడంతో అట్టి విషయాన్ని ఈ నెల10 తారీఖున వైరా మండల వ్యవసాయ అధికారికి మరియు కంపెనీ డీలర్కు ఫిర్యాదు చేశానని తెలిపారు.నకిలీ విత్తన సమస్యపై వెంటనే స్పందించి రిపోర్టు తయారు చేయాల్సిన వ్యవసాయశాఖ అధికారి తన సరిగా స్పందించకపోయేసరికి తన సమస్యను సంబంధిత శాఖ పై అధికారి అయిన కమీషనర్ దృష్టికి తీసుకెళ్లగా ఈ నెల16 వ తేదీన వైరా మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్ ఫీల్డ్ పరిశీలనకు వచ్చాడని తెలిపారు.అదె క్షేత్రస్థాయిలో మండల వ్యవసాయ శాఖాధికారి స్పందించి తమ విధులను సక్రమంగా నిర్వహించి ఉంటే తనకు ఈ నష్టం జరిగి ఉండేది కాదని ఆయన అన్నారు.న్యాయవాది అయిన నేనే యిట్టి విషయమై సంబంధిత శాఖ పై అధికారులకు సమాచారం ఇస్తే తప్ప మండల స్థాయి అధికారులు స్పందించలేదంటే ఇక సాధారణ రైతుల పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చునని ఆయన అంటున్నారు.ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి నకిలీ విత్తనాలతో రైతులను మోసం చేసిన కంపెనీ,నకిలీ విత్తనాలను విక్రయించిన షాపులపై చర్యలు తీసుకోవడమే కాకుండా విధి నిర్వహణలో అలక్ష్యం వహించి రైతుల నష్టానికి ప్రధాన కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
*చట్టపరమైన చర్యలు తీసుకుంటా*:-ఏ.వో.పవన్ కుమార్ 
వైరా మండలంలోని స్టేజి పినపాక గ్రామంలో ఉన్న వెంకటకృష్ణ ట్రేడర్స్ నందు కొనుగోలు చేసిన పత్తి విత్తనాలు సరిగా మొలకెత్తలేదని తల్లాడ మండలం ముద్దునూరు గ్రామానికి చెందిన అనుమోలు రామారావు అనే రైతు ఫిర్యాదు చేయగా ఆ కంపెనీ విత్తనాలు సెల్ నిలుపుదల చేస్తామని తెలిపారు.అంతేగాకుండా తదుపరి చర్యలు అయినా స్టాప్ సేల్స్ ఇచ్చి ఉన్నతాధికారులు పర్మిషన్తో మరల విత్తన నమూనాలను,DNA ఫింగర్ ప్రింట్ ల్యాబ్ మలక్పేట హైద్రాబాద్ వారికి పంపడం జరుగుతుందని,అనంతరం పై అధికారుల ఆదేశాలతో శాఖ పరంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏ.వో పవన్ కుమార్ తెలిపారు.