కనీవిని ఎరుగని రీతిలో పట్టణంలో మెగా ఉచిత వైద్య శిబిరం కు అపూర్వ స్పందన

Published: Monday April 25, 2022
మధిర ఏప్రిల్ 24 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడు "కే వి అర్ హాస్పిటల్ అధినేత డా.కోట రాంబాబు అధ్వర్యంలో విజయవాడ మణిపాల్ హాస్పిటల్ వారి సహకారంతో" ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిభిరం కు విశేష స్పందన వచ్చింది. పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు నియోజకవర్గ పేద ప్రజలకు ప్రజలకు అనేక సౌకర్యాలతో వైద్య శిబిరం ఏర్పాటు చేసినందుకు డా.కోట రాంబాబు ని అభినందించారు. ఇటువంటి వైద్య శిబిరాల ద్వారా పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం అభినందనీయం అని అన్నారు. ఈ సందర్భంగా శిభిరం నిర్వాహకులు డా.కోట రాంబాబు మాట్లాడుతూ నియోజకవర్గంలో వున్న పేద ప్రజలకు ఉపయోగపడేలా ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేసి దాదాపు 1500 మందికి ఉచిత వైద్య సేవలు అందించాం అని తెలిపారు. 200 మందికి గుండెకు 2D ఎకో మరియు 150 మంది స్త్రీలకు క్యాన్సర్ మామోగ్రఫి మరియు 400 మందికి ECG తీసి మిగిలిన వారికి పరీక్షలు నిర్వహించి వారికి తగిన మందులు ఉచితంగా ఇవ్వడం జరిగింది. మున్సిపాలిటీలో లోని ఎన్నడూ లేనివిధంగా ఈ వైద్య శిభిరం నిర్వహించి గుండె, క్యాన్సర్, నరాల వైద్యులతో ఉచిత వైద్య సేవలు అందించడం ప్రథమం అని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇలాంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంలో ఎప్పుడు కూడా ముందు ఉంటాను అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ శిభిరంలో మణిపాల్ హాస్పిటల్ హాస్పిటల్స్ వైద్యులు గుండె విభాగం డా.రాజీవ్, నరాల విభాగం డా.రవికాంత్, క్యాన్సర్ విభాగం డా.రాజీవ్, స్త్రీల విభాగం డా.అరుణ కుమారి దంత విభాగం డా.లక్ష్మి ప్రకాష్ పిల్లల విభాగం డా.శ్రీనివాస్ పాల్గొని ఉచితంగా వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో sc కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, డీసీసీబీ డైరెక్టర్ ఐలూరి వెంకటేశ్వర రెడ్డి, యన్నం కోటేశ్వరరావు, కటికల సీతారామిరెడ్డి, ఎర్రుపాలెం జెడ్పీటీసీ శీలం కవిత, మీనవోలు ఎంపిటిసి మల్లికార్జున్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి, చావలి రామరాజు, వుమ్మినేని కృష్ణ, బాగం నాగేశ్వరరావు, సత్యం రెడ్డి, కోటిరెడ్డి,  మందడపు శ్రీను, అక్కినపళ్లి నాగేశ్వరావు, నాగరాజు, సత్యం,  తదితరులు పాల్గొన్నారు.