ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించిన పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్.

Published: Monday December 12, 2022
బూర్గంపాడు (ప్రజా పాలన.)
భద్రాచలం కిమ్స్ హాస్పిటల్ వారి సౌజన్యంతో పి ఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మణుగూరు పట్టణంలోని జడ్పీహెచ్ఎస్  స్కూల్ నందు ఈరోజు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క వైద్య శిబిరంలో కార్డియాలజీ ,న్యూరోసర్జన్ ,జనరల్ సర్జన్ ,జనరల్ మెడిసిన్ గైనకాలజీ, డెర్మటాలజీ విభాగాల వైద్యులు పాల్గొని సుమారు 570 మందికి ఓపి చూసి షుగర్, బిపి ,ఈసిజి ఉచితంగా పరీక్షలు చేసి ఉచితంగా చూసి ఉచిత మందులు ఇవ్వడం జరిగింది. పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన నిరుపేదలకు ఉచిత వైద్యం అందించాలని  మంచి తలంపుతో  పి ఎస్ ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యం లో ఇలాంటి మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో ఇలాంటి ఉచిత వైద్య క్యాంపులు నిర్వహించినందుకు భద్రాచలం కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యాన్ని మణుగూరు ప్రజలు అభినందించడం జరిగింది.   కార్యక్రమంలో హాస్పిటల్ జనరల్ మేనేజర్ బాబురెడ్డి . రవిరెడ్డి  మార్కెటింగ్ మేనేజర్లు వెంకటేశ్వరరావు,కురం.రవి  అనిల్ , వెంకటేశ్,మరియు  హాస్పటల్ సిబ్బంది పాల్గొనడం జరిగింది