భారతదేశాన్ని ప్రైవేటు వ్యక్తులకు అమ్ముతున్న మోడీ గో బ్యాక్

Published: Friday November 11, 2022

మంచిర్యాల టౌన్, నవంబర్ 10, ప్రజాపాలన :  భారతదేశాన్ని ప్రైవేటు వ్యక్తులకు అమ్ముతున్న మోడీ ఈనెల 12న తెలంగాణ రాష్ట్రంలో పలు కార్యక్రమాలకు వస్తున్న సందర్భంలో మోడీ రాకను నిరసిస్తూ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో మోడీ గో బ్యాక్ అంటూ నినాదాలు నిరసన తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ బిజెపి,మోడీ ఎన్నికల హామీల్లో భాగంగా యువతకు రెండు కోట్ల వరకు ఉద్యోగాలు కల్పిస్తామని, విదేశాల్లో ఉన్నటువంటి నల్లధనాన్ని తెప్పించి ప్రజలే అకౌంట్లో 15 లక్షల రూపాయలు జమ చేస్తామని చెప్పి నేడు భారతదేశం లో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ఒకదాని తర్వాత ఒకటి ప్రైవేట్ పరం చేస్తూ గతంలో ఎన్నడూ లేనివిధంగా నిరుద్యోగాన్ని పెంచుతూ పోతుందని దీనివల్ల యువత,ప్రజలు ఎన్నడు లేనంత నిరాశ,నిస్పృహలతో ఉన్నారని అన్నారు. బిజెపి తీసుకొస్తున్న నూతన విద్యా విధానం ద్వారా పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడుతుందని వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఎలా వస్తారని మోడీ వెనక్కి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో చిప్పకుర్తి శ్రీనివాస్, జుమ్మిడి గోపాల్,  రేగుంట క్రాంతి కుమార్, పురెళ్ల నితీష్, సతీష్, ప్రశాంత్, జయవర్ధన్,రాజశేఖర్,వేణుగోపాల్ లు పాల్గొన్నారు.