భారతదేశ త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది : ఎమ్మెల్సీ జీవ

Published: Friday December 10, 2021

జగిత్యాల, డిసెంబర్ 09 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాలలోని ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి నివాసంలో బిపిన్ రావత్ సంతాప సభను ఏర్పాటు చేసి ఆర్మీ హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించిన రావత్ చిత్ర పటానికి టి.జీవన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జీవన్ రెడ్డి మాట్లాడుతూ భారత దేశానికి రక్షణగా నిలిచిన దేశ రక్షణ త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ మృతి దేశానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. త్రివిధ దళాల్లో రావత్ అథ్మస్థైర్యాన్ని నింపారని పాకిస్థాన్ భారత్ పై ధాడి జరిపిన నేపధ్యంలో ఎదురుదాడితో సర్జికల్ స్ట్రైక్ నిర్వహించి శత్రు దేశాలకు భారతదేశ రక్షణ సత్తా ఏంటో నిరూపించిన ఘనత రావత్ గారు అని కొనియాడారు. దేశాన్ని సైనిక పరంగా రావత్ తీసుకున్న చర్యలు అమోఘమని రక్షణ శాఖలో విశిష్ట సేవలంది తాను విధ్య అభ్యశించిన కళాశాలలో ప్రసంగించడానికి వెళ్లి హెలిక్యాప్టర్ ప్రమాదంలో మృతి చెందడం భాదాకరం అని రావత్ గారితో పాటు 13 మందీ మృతికి మరియు తెలుగు బిడ్డ సాయి తేజ మృతికి సంతాపం తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలుగాలని కోరారు. బిపిన్ రావత్ గారి మృతికి సంతాప సూచికంగా సొనియా గాంధీ గారి నిర్ణయం మేరకు గురువారం జరుగాల్సిన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలన్ని రద్దు చేసుకున్నాం అని అన్నారు. డిసెంబర్ 9న సొనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేశారని జీవన్ రెడ్డి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి కొత్త మోహన్ బండ శంకర్ సిరాజోద్దీన్ ధరూరి రమేష్ పులి రాము కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.