ప్రమాదాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి **

Published: Friday December 16, 2022
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ **
 
ఆసిఫాబాద్ జిల్లా డిసెంబర్15 (ప్రజాపాలన,ప్రతినిధి) : అగ్ని ప్రమాదాలు, వరదలు, రైస్ మిల్లులు, పత్తి జిన్నింగ్ మిల్లులు, కెమికల్ ఫ్యాక్టరీలలో సంభవించే ప్రమాదాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ప్రాణ రక్షణకు సమయస్ఫూర్తితో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో  జిల్లా అదనపు కలెక్టర్ రాజేశం, ఇన్చార్జి జిల్లా రెవిన్యూ అధికారి రాజేశ్వర్ తో కలిసి ప్రమాదాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేసవికాలంలో అగ్ని ప్రమాదాలు, వర్షాకాలంలో వరదలు, రసాయనిక ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలు సమయస్ఫూర్తితో వ్యవహరించాలని తెలిపారు. ఇందు కొరకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నిర్వహిస్తున్న ఎన్.డి.ఆర్.ఎఫ్. సంస్థ ద్వారా ప్రబాదాలు సంభవించినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు జిల్లాలో కార్యచరణ రూపొందించడం జరిగిందని, పాఠశాలల, కళాశాలల విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో"మౌన్ టెల్ కార్యక్రమం" నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రసాయనిక ప్రమాద సమయంలో ఫేస్ మాస్ ధరించి నిర్విషికరణ కిట్, మందులు, అత్యవసర సేవల ఆసుపత్రుల నెంబర్లు అందుబాటులో ఉంచుకోవాలని,రసాయనిక దాడి జరిగినప్పుడు శరీరాన్ని కప్పుకొని,ముఖం మీద తడి గుడ్డ ఉంచి నెమ్మదిగా శ్వాస తీసుకోవాలని,బహిరంగంగా లభించే ఆహారం, పానీయాలు తీసుకోకూడదని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్.డి.ఆర్.ఎఫ్.సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 16వ ఉదయం 9.30 కు కాగజ్ నగర్ లోని ఎస్.పి.ఎమ్.మైదానంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు మాకు డ్రిల్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.