ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసమే పిఆర్టియు పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు మోత్కూరి మధు

Published: Thursday September 15, 2022
బోనకల్, సెప్టెంబర్ 14 ప్రజాపాలన ప్రతినిధి: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో పి ఆర్ టి యు ముందంజలో ఉందని ఆ సంఘ జిల్లా అధ్యక్షులు మోత్కూరి మధు తెలిపారు. మండలంలోని రావినూతల చిరునోముల, బోనకల్, ముష్టికుంట్ల ఉన్నత పాఠశాలలో బుధవారం పిఆర్టియు సంఘ సభ్యత్వ క్యాంపియన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమోషన్లు బదిలీలు చేపట్టకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని స్పష్టం చేశారు. విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని ఆరోపించారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వలన నాణ్యమైన విద్య అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు లేకుండా జిల్లా మండల టీములు పాఠశాలలను విస్తృతంగా తనిఖీ చేయడం వల్ల ఒరిగేదేమీ లేదన్నారు. కస్తూరి పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించటం కోసం తమ సంఘ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు. తమ సంఘం ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదని ఉపాధ్యాయుల కోసం మాత్రమే పనిచేసే సంఘం అన్నారు. ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు పి ఆర్ టి యు ను ఆదరించాలని కోరారు. పాఠశాలల్లో పర్యవేక్షక పోస్టులను పూర్తిస్థాయిలో నింపకుండా ఉన్నవారిని రెండు మండలాలకు ఇన్చార్జిలుగా వేయడం వల్ల ఉపాధ్యాయులు పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని వాపోయారు. పోరాటానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిఆర్టియు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు యలమద్ది వెంకటేశ్వరరావు, జిల్లా మండల నాయకులు సుజాత,రవికుమార్, కొనకంచి రామ్మోహన్, బంధం వెంకన్న, కొండలరావు, శ్రీనివాసరావు, సీతారామారావు, రమేష్, శ్రీనివాసరెడ్డి, లింగతదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area